You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
1970ల నాటి చమురు సంక్షోభం ఏంటి? అంతకంటే దారుణ పరిస్థితులను ఎదుర్కోబోతున్నామా?
1973 అక్టోబర్‌లో యోమ్ కిప్పూర్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు అమెరికా నేతృత్వంలోని కూటమిలో భాగస్వాములైన దేశాలపై అరబ్ చమురు ఉత్పత్తిదారులు ఆంక్షలు విధించారు. దీంతో పాటు చమురు ఉత్పత్తిలోనూ కోతలు అమల్లోకి వచ్చాయి.
ఇరాన్: "అమెరికా సైనికులు వస్తే నిప్పుల వర్షం కురిపించేందుకు ఎదురు చూస్తున్నాం’’
ఇరాన్ భూభాగంలోకి అమెరికా బలగాలు అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే… ఇరాన్ "నిప్పుల వర్షం" కురిపిస్తుందని మొహమ్మద్ బగారే గాలిబఫ్ అన్నారు."శత్రువు బహిరంగంగా చర్చల సంకేతాలు పంపిస్తారు. మరోవైపు రహస్యంగా భూతల దాడుల కోసం ప్రణాళికలు రచిస్తారు" అంటూ గాలిబఫ్ వ్యాఖ్యానించినట్టు ఇరాన్ అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి.
వైభవ్ సూర్యవంశీ: పరుగులు చేయడానికి సీఎస్కే చెమటోడ్చిన పిచ్‌పై ఈ 15 ఏళ్ల కుర్రాడు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఎలా బాదాడు?
అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో 35 బంతుల్లో వంద పరుగులు చేసి రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. గత సీజన్లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.
ఒక్కో చీమ రూ.21 వేలు.. ఈ చీమలతో స్మగ్లర్లు ఏం చేస్తున్నారు?
వర్షాకాలంలో.. మగ చీమలకు రెక్కలు విచ్చుకుని, రాణి చీమతో సంభోగం జరిపేందుకు ఎగురుతాయి. ఆ సమయంలో రాణి చీమ కూడా ఎగురుతుంది. రాణి చీమలను పట్టుకుని, స్మగ్లర్లకు వాటిని అమ్మేందుకు అదే సరైన సమయం. ఇందులో అత్యంత ఎక్కువ మంది కోరుకునేది ''అతిపెద్ద ఆఫ్రికన్ హార్వెస్టర్'' అనే రాణి చీమనే. ఇది చాలా పెద్దగా, ఎరుపు రంగులో ఉంటుంది.
చైనా మ్యాక్సింగ్: ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం మంచిదేనా?
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 'న్యూలీ చైనీస్', 'చైనా మ్యాక్సింగ్' అనే ట్యాగ్‌లతో లక్షల వ్యూస్ ఉన్న వీడియోస్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలలో ఎక్కువగా యువతే కనిపిస్తోంది. వారంతా తమ రోజును వేడినీరు తాగుతూ, వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ తింటూ, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలతో మొదలుపెడుతున్నట్లుగా ఆ వీడియోల్లో కనిపిస్తున్నారు. కానీ, ఈ సాధారణ అలవాట్లు నిజంగానే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా?
'అమరావతి' రాజధానిపై ఏపీ ప్రభుత్వం తీర్మానం.. దీనిపై విపక్ష వైసీపీ ఏమంటోంది?
అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కీలక తీర్మానం చేసింది. 2028 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించగా, ఇవన్నీ 'డైవర్షన్ పాలిటిక్స్' అంటూ వైసీపీ విమర్శించింది.
ఖార్గ్: ఈ దీవిపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామంటున్న ట్రంప్, అమెరికా కన్ను దీనిపై ఎందుకు పడింది?
కేవలం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ఐలాండ్‌పై బాంబులు వేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా సాహసించలేదు. ఇరాన్ తీరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వ్యూహాత్మకంగా ఎందుకు కీలకం?, ఇపుడు అమెరికా కన్ను దీనిపై ఎందుకు పడింది?
'గినీ ఆంటీ': లండన్ సబ్వేలో పరిచయమైన వ్యక్తికి అండాలు దానం చేసిన మహిళ, ఈ కథలో మలుపులు ఏంటంటే..
సబ్వేలో మొదలైన ఓ చిన్న సంభాషణ ఒకరి జీవితాన్నే మార్చేసింది. తన అండాలను దానం చేసి ఓ జంటకు బిడ్డను ప్రసాదించిన గినీ భోగాల్ కథ ఇది. 30 ఏళ్ల తర్వాత ఆ 'మిరాకిల్ బేబీ' క్రిస్టోఫర్ తన నిజమైన మూలాలను తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే..
‘యువతిని హత్య చేసి, ఫ్రిజ్‌లో శరీర భాగాలు దాచి..’
డేటింగ్ యాప్‌లో పరిచయమైన 29 ఏళ్ల మౌనిక అనే యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో వెలుగులోకి వచ్చింది. తూర్పు నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల రవీంద్రను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు బీబీసీకి తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.