BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అశోక చక్రవర్తి: ఎన్నో యుద్ధాలను గెలిచిన అశోకుడు.. చివరికి శాంతిమార్గాన్ని ఎలా ఎంచుకున్నారు?
క్రీస్తు పూర్వం 362లో అశోక చక్రవర్తి కళింగపై యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో లక్ష మంది మరణించగా, యుద్ధానంతరం తలెత్తిన పరిస్థితుల కారణంగా అంతే సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదిలారు. ఆ తర్వాత అశోకుడికి ఏమైంది?
అనూహ్యంగా పెరిగిన వైర్డ్ హెడ్‌ఫోన్స్ సేల్స్.. అసలు బ్లూటూత్‌పై వ్యతిరేకతకు కారణమేంటి?
వైర్ల కాలం మళ్లీ వచ్చేసింది. హెడ్‌ఫోన్ జాక్ పోయినా, వైర్డ్ హెడ్ఫోన్లకు క్రేజ్ తగ్గకపోగా.. ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. 2026లో సెలబ్రెటీల నుంచి సామాన్య జనం వరకు మళ్లీ వైర్ల వైపు క్యూ కడుతున్నారు. ఈ మార్పునకు కారణమేంటి?
అగ్రరాజ్యాలతో రక్షణ ఒప్పందాలు గల్ఫ్ దేశాలకు భద్రత కల్పించలేకపోయాయా? స్వీయ రక్షణకు కొత్త వ్యూహం అవసరమా?
ఇటీవలి యుద్ధం గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థల సమర్థతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ప్రపంచ అగ్రరాజ్యాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాల మేరకు విదేశీ సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇవ్వడంపైనా ప్రశ్నలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యాల మద్దతున్నప్పటికీ, గల్ఫ్ దేశాలు తమ స్వీయరక్షణకు కొత్త వ్యూహం అనుసరించాల్సిన ఆవశ్యకత తలెత్తిందా?
నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ, మాజీ హోమ్ మంత్రి రమేశ్ లేఖక్ అరెస్ట్
నేపాల్ మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూఎంఎల్) నేత కేపీ శర్మ ఓలీని, మాజీ హోమ్ మంత్రి రమేశ్ లేఖక్‌ను అరెస్ట్ చేసినట్లు నేపాల్ పోలీసు అధికార ప్రతినిధి అభినారాయణ్ కాఫ్లే తెలిపారు. ఓలీని, రమేశ్ లేఖక్‌ను కాఠ్మాండూ పోలీసు కాంపౌండ్‌కు తరలించినట్లు బీబీసీకి చెప్పారు కాఫ్లే.
అమెరికా, ఇజ్రాయెల్ ఏకమై దాడులు చేసినా ఇరాన్లో అధికారాన్ని మార్చలేకపోయాయి ఎందుకు?
ఇంటర్నెట్ సేవలను దాదాపు పూర్తిగా నిలిపేయడం వల్ల ప్రజలు సంఘటితమయ్యే శక్తి మరింత పరిమితమైపోయింది. కమ్యూనికేషన్, సమన్వయం, సమాచార మార్పిడి ఆధారంగా నిరసనలను నిర్వహించే నెట్‌వర్క్‌లు చాలావరకు దెబ్బతిన్నాయి. మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం తమ మద్దతుదారులకు పరిమితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ.. తన వాదనను ప్రపంచానికి వినిపిస్తోంది.
తోడేళ్ల సంతతి నుంచి వచ్చిన కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఈ చిన్న దవడ ఎముక చెబుతున్న చరిత్రేంటి?
సోమర్సెట్లోని ఒక గుహ భూగర్భంలో దొరికిన దవడ ఎముకలోని ఒక భాగం.. కుక్కలు మనకెప్పుడు, ఎలా ప్రాణ స్నేహితులయ్యాయనే చరిత్రను తిరగరాసింది.
వైభవ్ సూర్యవంశీ: భారత జట్టులో ఎంట్రీకి ఈ టీనేజర్‌కు లైన్ క్లియర్ అయినట్టేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అందరి దృష్టి ప్రముఖ ఆటగాళ్లపైనే ఉండనుంది, అందులో ఓ టీనేజర్‌పై కూడా. అతనే వైభవ్ సూర్యవంశీ. టీం ఇండియాలోకి వచ్చేందుకు వైభవ్‌కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనా?
'చిన్నస్వామి స్టేడియంలో ఆ 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం' అని ఆర్సీబీ ఎందుకు అన్నది?
గత ఏడాది తొక్కిసలాట నేపథ్యంలో, అసలు ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారా లేదా అనేదీ కొన్ని వారాల క్రితం వరకూ ప్రశ్నార్థకంగా ఉండేది.
బాలెన్ షా: కర్ణాటకలో చదివిన ఈ ర్యాపర్.. నేపాల్ ప్రధాని దాకా ఎలా ఎదిగారు?
నేపాల్ రాజధాని కాఠ్మాండూకు మేయర్‌గా పనిచేసిన మూడేళ్లలోనే.. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీతో జతకట్టి బాలెన్ షా ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీకి దిగారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.




























































