You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్‌పై కోడికత్తితో దాడి కేసు ఎన్‌ఐఏకు
విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో 2018 అక్టోబరు 25న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించారు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ డిసెంబరు 31న ఉత్తర్వులిచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్ ఏపీ హైకోర్టుకు తెలిపారు.
దీంతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ స్టేషన్‌లో జనవరి 1న ఎఫ్‌ఐఆర్ నమోదైందని లక్షణ్ వివరించారు.
నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేయడంతో జగన్ ఎడమ చేతికి గాయమైంది.
శ్రీనివాస్‌ను విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌గా పోలీసులు గుర్తించారు.
నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ధనియాలపాలెం వాసి అని చెప్పారు.
దాడి తర్వాత జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఇవి కూడా చదవండి:
- పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీల అమలు సాధ్యమేనా?
- పుజారా లేకుంటే ఆస్ట్రేలియాలో భారత్ పరిస్థితి ఎలా ఉండేది?
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- బంగ్లాదేశ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన షేక్ హసీనా ఎవరు?
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- మోదీ ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)