ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదవండి.

1. క్లా హెయిర్ క్లిప్: 'మహిళలు ఇష్టపడే ఈ క్లిప్‌ను కనిపెట్టింది మా నాన్నే'

ప్రస్తుత కాలంలో బజార్లో రకరకాల హెయిర్ క్లిప్స్ దొరుకుతున్నాయి. 30 ఏళ్ల క్రితం క్లా క్లిప్ కనిపెట్టింది మా నాన్నే. కోవిడ్ సమయంలో సెలూన్లు మూతపడడంతో జుట్టు మేనేజ్ చేయడం ఆడవాళ్లకు పెద్ద పనైంది. అందంగా ఉంటూ సౌకర్యంగా ఉండే హెయిర్ క్లిప్స్‌కు డిమాండ్ పెరిగింది.

జుట్టు అంతటినీ దగ్గరగా చేసి, చక్కగా నొక్కిపెట్టి ఉంచే 'క్లా క్లిప్' 1900లలో ఫ్రాన్స్‌లోని ఓ చిన్న వర్క్‌షాప్‌లో ఊపిరి పోసుకుందన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు.

ఇవి కూడా చదవండి

2.అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ భూమికి విద్యుత్తును అందించగలవా?

అంతరిక్షంలోనే సౌర శక్తిని సమీకరించి సూక్ష్మ తరంగాల ద్వారా భూమికి పంపించడం సాధ్యమేనా? అంటే.. సాధ్యామే అంటున్నారు శాస్త్రవేత్తలు. 2035 నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు స్పేస్ ఎనర్జీ ఇనిషియేటివ్ (ఎస్‌ఈఐ) కో-చైర్మన్ మార్టిన్ సోల్టౌ.

ఎస్‌ఈఐ.. కాసియోపియా అనే ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. చాలా పెద్ద ఉపగ్రహాల కూటమిని భూ కక్ష్యలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?

అత్యాచార కేసుల దర్యాప్తుకు ఉపయోగించే 'టూ ఫింగర్ టెస్ట్'కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య పుస్తకాల నుంచి ఈ దర్యాప్తు పద్ధతిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. అది "పితృస్వామ్య భావజాలంతో కూడినదని, అశాస్త్రీయమైనదని" పేర్కొంది.

వైద్య కళాశాలలో స్టడీ మెటీరియల్‌ నుంచి టూ ఫింగర్ టెస్ట్‌ సిలబస్‌ను తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార కేసుల విచారణకు అవలంబించే ఈ పద్ధతి అశాస్త్రీయమని, లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని మళ్లీ హింసించినట్టు అవుతుందని కోర్టు పేర్కొంది. అసలు టూ ఫింగర్ టెస్ట్ ఏంటి? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

4. 'జూ'లో జంతువులుగా మనుషులు - 1958 వరకు కొనసాగిన అమానుషం

ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రాంతాలకు చెందిన మనుషులను పట్టుకొచ్చి జంతువుల్లాగా 'జూ'లు ఏర్పాటు చేసి, ప్రదర్శించిన చరిత్ర యూరప్‌‌ వలస పాలకులకు ఉంది.

సముద్రాలను దాటి ఇతర ఖండాలకు అన్వేషణ మొదలైనప్పటి నుంచీ కొనసాగిన ఈ అమానవీయత.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస రాజ్యాలు కుప్పకూలే వరకూ కొనసాగింది.

పదిహేనో శతాబ్దం ఆరంభంలో ప్రస్తుత మెక్సికో ప్రాంతంలో ఉన్న ఆజ్టెక్ సామ్రాజ్యంలో 'మాక్టెజుమా జూ' నుంచి మనుషుల జూ చరిత్ర కనిపిస్తుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

5. గ్రీన్ వాష్ అంటే ఏమిటి? ఎలా గుర్తించాలి?

COP 27 పేరిట ఈజిప్ట్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుకు తాను హాజరు కావడం లేదని క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్ తెలిపారు.

అధికారంలో ఉన్న వ్యక్తుల మోసపూరిత ప్రచారానికి, అబద్ధాలు చెప్పడానికి మాత్రమే ఇది వేదిక కానుందనే కారణంతో తాను హాజరుకాబోవడం లేదని గ్రెటా వెల్లడించారు. తన కొత్త పుస్తకం ఆవిష్కరించిన సందర్భంగా ఆమె లండన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. గత వాతావరణ సమావేశాలలోనూ ఇలాంటి గ్రీన్ వాషింగే జరిగిందని ఆమె అన్నారు. ఇంతకీ గ్రెటా చెబుతున్న గ్రీన్ వాషింగ్ ఏంటి? గుర్తించడం ఎలా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)