ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు చదవకపోతే వెంటనే చదవండి.

1. రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?

పొన్నియన్ సెల్వన్-1 సినిమాలోని ప్రధాన పాత్ర అయిన రాజరాజ చోళుడు కేంద్రంగా ఇప్పుడు వివాదం అలుముకుంటోంది.

రాజరాజ చోళుడు హిందువు కాదంటూ తమిళ సినిమా డైరెక్టర్ వెట్రిమారన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

తమిళనాడుకు చెందిన దళిత పార్టీ 'విడుదలై చిరుతిగల్ కట్చి' నాయకుడు 'తొల్ తిరుమావలవన్' 60వ పుట్టిన రోజు వేడుకలకు ఇటీవల వెట్రిమారన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పటికే మన గుర్తింపుల్లో చాలా వాటిని తుడిచి వేశారు. తిరువళ్లువర్‌(ప్రాచీన తమిళ కవి)కు కాషాయం చుట్టారు. రాజరాజ చోళున్ని హిందూ రాజుగా చిత్రీకరిస్తున్నారు.

ఇలాంటివి మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఇది సినిమాలోనూ జరుగుతుంది. ఇప్పటికే అనేక గుర్తింపులను సినిమా నుంచి తుడిచేశారు. తమిళ ప్రజల ఉనికి లాగేసుకుంటున్నారు. దాన్ని మనం రక్షించుకోవాలి' అని వెట్రిమారన్ అన్నారు.

2. బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా? ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?

బల్లి పేరు చెప్పగానే చాలా మంది ఉలిక్కిపడతారు. మరికొందరు భయపడుతుంటారు. ఇంకొందరు అయితే అపశకునంగా భావిస్తారు.

కానీ ఒకవేళ మన ఇంట్లో అసలు బల్లులే లేకపోతే ఏం జరుగుతుంది? మన ఇంటికి బల్లులకు సంబంధం ఏమిటి?

ఈ అంశంపై పర్యావరణవేత్త, జంతువుల నిపుణుడు ఏ శణ్ముగనాథన్ బీబీసీతో మాట్లాడారు.

ఆ వివరాలు ప్రశ్నలు-సమాధానాల రూపంలో మీకోసం.

3. మంత్రం అంటే ఏంటి? మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా?

మనుషుల ఆలోచనా విధానంలో ఏమైనా తప్పు ఉందా?

మంత్రాలతో ధ్యానం చేస్తే మెదడుకు మేలు జరుగుతుందా?

'ఒక రోజులో అంటే 24 గంటల్లో మన మెదడులో 60వేల ఆలోచనలు పుడతాయి. మనసు కోతిలాగా ఇష్టం వచ్చినట్లు చిందులు వేయకుండా చూసేదే మంత్రం. ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు వెంట వెంటనే మారిపోకుండా ఇది చూస్తుంది.

మనసు ఎప్పుడూ ఒకేసారి అనేక పనులు చేయాలని చూస్తుంది. ఇతరులను చూసి వారిలాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది' అని ది 'ఏన్సియెంట్ సైన్స్ ఆఫ్ మంత్రాస్' అనే పుస్తకం రాసిన ఓం స్వామి తెలిపారు.

4. భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి?

జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు.

ఇంతకీ జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతలు ఏమిటి?

విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు?

5. ఈ పిల్లల దగ్గు మందులతో జాగ్రత్త: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఓ భారత్ కంపెనీ తయారు చేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

ఈ మందులపై ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీచేసింది.

ఈ నాలుగు మందులను భారత్‌కు చెందిన ‘‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’’ తయారుచేసింది. ఈ విషయంపై స్పందించాలని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌ను బీబీసీ కోరింది.

అయితే, పిల్లల మరణాలు, దగ్గు మందుల మధ్య సంబంధాన్ని ధ్రువీకరించే ఆధారాలను డబ్ల్యూహెచ్‌వో ఇంకా తమకు ఇవ్వలేదని మైడెన్‌కు చెందిన భారత అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)