హార్ముజ్‌ను తెరవడానికి 3 మార్గాలున్నా, ట్రంప్ దిగ్బంధనాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

అమెరికా, హార్ముజ్ జలసంధి, నౌకల దిగ్బంధనం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయడానికి తమకు తగినంత 'నేవీ పవర్' ఉందని అమెరికా అంటోంది (ప్రతీకాత్మక చిత్రం).
    • రచయిత, ఇల్యా అభిషేక్
    • హోదా, బీబీసీ రష్యన్ సర్వీస్ డిఫెన్స్ అనలిస్ట్
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ, హార్ముజ్ జలసంధి మార్గం అన్ని వాణిజ్య నౌకల కోసం కాల్పుల విరమణ ముగిసే వరకు పూర్తిగా తెరిచి ఉంటుందని తెలిపారు.

అదేరోజు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో హార్ముజ్ జలసంధి తెరిచినందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కానీ, మరో పోస్ట్‌లో- "హార్ముజ్ జలసంధి వ్యాపారం, రాకపోకల కోసం పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ, నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుంది" అని అన్నారు.

ఒకవేళ అమెరికా తన ఓడరేవులపై ఆంక్షలు కొనసాగిస్తే, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది.

దీంతో, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సైన్యం మళ్లీ నియంత్రణ చేపడుతోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా శనివారం ప్రకటించింది.

అమెరికా దిగ్బంధనానికి నిరసనగా ఆదివారం కూడా ఇరాన్ ఈ మార్గాన్ని మూసి ఉంచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాగా, ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినప్పుడు, అమెరికా ముందు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి.

అమెరికా, హార్ముజ్ జలసంధి, నౌకల దిగ్బంధనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

నాలుగో మార్గం వైపు ట్రంప్

ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నాలుగో మార్గాన్ని ఎంచుకున్నారు: అదే దిగ్బంధం.

హార్ముజ్ జలసంధిలో నేవీ ఆపరేషన్‌కు 'నేటో' మిత్రదేశాలను అమెరికా ఒప్పించలేకపోయింది. అంతేకాకుండా, ఈ మార్గం మూసివేత వల్ల ప్రభావితమైన ఆసియా దేశాలతో కూటమిని ఏర్పాటు చేయడంలోనూ వాషింగ్టన్ విఫలమైంది. ఫలితంగా, ఒంటరిగానే చర్యలు చేపట్టాల్సి వచ్చింది. దాని సామర్థ్యాలు, వనరులు అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.

ఇరాన్‌పై ఆపరేషన్ ప్రారంభిస్తూ మధ్యప్రాచ్యంలో భారీ నౌకాదళాన్ని మోహరించింది అమెరికా. అక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన విధ్వంసక నౌకలు, గస్తీ నౌకలు, ఇతర యుద్ధ సంపత్తి ఉన్నాయి. వీటికి తోడు విమానాలు, హెలికాప్టర్లను మోసే రెండు విమాన వాహక నౌకలను కూడా చేర్చారు. అయితే, ఈ యుద్ధ నౌకలలో కొన్ని మాత్రమే హార్ముజ్ జలసంధిలో సమర్థవంతంగా పనిచేయగలవు.

ట్రంప్ ఎంచుకున్న నాలుగో మార్గం పైకి హేతుబద్ధంగానే కనిపిస్తుంది: ఇరాన్ ఈ జలసంధిని మూసి ఉంచితే, ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ వ్యూహం వల్ల అమెరికా అనుకున్నది సాధించే అవకాశం ఉన్నప్పటికీ, ఇరాన్ భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారింది. సాంకేతికంగా చూస్తే, ఈ చర్యను అమలు చేయడం అమెరికాకు సాధ్యమే.

ఇరాన్ తీరానికి దూరంగా, ఒమన్ గల్ఫ్, అరబిక్ సముద్రంలో ఉన్న ఇరాన్ 'షాడో ఫ్లీట్స్' (రహస్య నౌకాదళం) నౌకలను అడ్డుకుంటే అమెరికా యుద్ధ నౌకలకు ముప్పు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలాంటి దిగ్బంధనానికి వాషింగ్టన్ వద్ద తగిన నౌకాదళ శక్తి అందుబాటులో ఉంది. మధ్యప్రాచ్య భద్రతను పర్యవేక్షించే అమెరికా 'ఐదో ఫ్లీట్' వ్యవస్థ ఎలాంటి పరిస్థితికైనా తగ్గట్టుగా మలుచుకునేలా ఉంటుంది. మిషన్ అవసరాలకు దీనిని వెంటనే మార్చుకోవచ్చు.

డోనల్డ్ ట్రంప్ ప్రకారం, 'ఈ ప్రాంతానికి అదనపు బలగాలను కూడా పంపిస్తున్నారు.'

అమెరికా, హార్ముజ్ జలసంధి, నౌకల దిగ్బంధనం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ తీరానికి వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్ ఫ్రాంక్ ప్యాటర్సన్‌ యుద్ధనౌకను మోహరించారు.

ఇరాన్‌కు మాత్రమే నష్టం కాదు

"అమెరికా తన సైనిక బలంతో హార్ముజ్ జలసంధిని తెరవగలదా అని పాఠకులు అడిగినప్పుడు ఇరాన్‌కు ఈ మార్గాన్ని మూసివేయడం ఎంత సులభమో.. ఇతరులకు దాన్ని తెరవడం అంతకంటే కష్టమని నేను సమాధానం ఇచ్చేవాడిని. అమెరికన్లు ఇప్పుడు ఈ సమీకరణాన్ని అర్థం చేసుకున్నారు" అని ఇజ్రాయెల్ సైనిక నిపుణుడు డేవిడ్ జెండెల్మాన్ తెలిపారు.

అయితే, డోనల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కేవలం ఇరాన్‌కు మాత్రమే నష్టం కలిగించదు. అమెరికా సైనిక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి నౌకల రాకపోకలకు అత్యంత ప్రమాదకరంగా మారిన హార్ముజ్ జలసంధిని తెరవడానికి వాషింగ్టన్ తొందర పడటం లేదు. కేవలం దిగ్బంధనాన్ని కఠినతరం చేస్తోంది.

ఇరాన్ వేసిన మైన్లు, క్షిపణులతో నిండిన సముద్ర మార్గం కారణంగా హార్ముజ్ జలసంధి ఇప్పటికే ప్రమాదకరంగా ఉంది. జలసంధి ద్వారం దగ్గర అమెరికా విధ్వంసక నౌక ఎదురైతే ఆ ప్రమాదం రెట్టింపు అవుతుంది.

ఇప్పటికే గల్ఫ్ దేశాల వాణిజ్య భాగస్వాములకు ఆర్థిక నష్టం వాటిల్లింది. సరఫరా గొలుసు దెబ్బతిని, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి.

అయితే, భారీ నౌకాదళం, జిబౌటిలో సైనిక స్థావరం ఉన్న చైనా.. ఈ దిగ్బంధనంపై ఎలా స్పందిస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. మరోవైపు, అమెరికా మిత్రదేశాలు ఆశాజనకంగా ఉండటానికి పెద్దగా కారణాలు కనిపించడం లేదు. వారిలో చాలామంది యుద్ధంలో పాల్గొనకపోయినా, దాని దుష్ప్రభావాలను అనుభవిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)