నో కింగ్స్ ప్రొటెస్ట్స్ : ‘‘ఇది అమెరికా, ఇక్కడ అధికారం ప్రజలదే’’ అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినదించిన 80 లక్షలకుపైగా జనం.. 8 చిత్రాలలో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శనివారం నాటి నిరసనల్లో 80 లక్షలమందికిపైగా ప్రజలు పాల్గొని ఉంటారని అంచనా
చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికా అంతటా పలు నగరాల్లో ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. 'నో కింగ్స్' పేరుతో ఇలా ర్యాలీలు జరగడం ఇది మూడోసారి.

శనివారం జరిగిన ఈ నిరసనల్లో 80 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలు, ఇరాన్ యుద్ధం, వలసలను కట్టుదిట్టం చేయడం, పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా ప్రజలు ఈ నిరసన చేశారు.

'ట్రంప్ మనల్ని ఒక నియంతలా పాలించాలని చూస్తున్నారు. కానీ, ఇది అమెరికా. ఇక్కడ అధికారం ప్రజలది. రాజులు అవ్వాలనుకునే వారిది, వారి బిలియనీర్ స్నేహితులది కాదు' అని నిర్వాహకులు వ్యాఖ్యానించారు.

'ఇవన్నీ నిజమైన నిరసనలు కావు. ట్రంప్‌పై ద్వేషంతో జరుగుతున్నవే ' అని వైట్ హౌస్ ప్రతినిధి ఈ నిరసనలను కొట్టిపారేశారు.

'ఈ నిరసనల గురించి వార్తలు రాసేందుకు డబ్బులు తీసుకునే రిపోర్టర్లకు తప్ప మరెవరూ వీటిని పట్టించుకోరు' అని ఆయన విమర్శించారు.

అయితే ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. గతంలో జరిగిన నో కింగ్స్ ప్రొటెస్ట్‌లోనూ ఇలాగే లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనా వేశారు.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ ముందు భారీగా గుమిగూడిన నిరసనకారులు

అమెరికా వ్యాప్తంగా దాదాపు ప్రతి పెద్ద నగరంలోనూ శనివారం నాడు ప్రదర్శనలునిర్వహించారు. అలాగే చిన్న పట్టణాలలోనూ ప్రజలు గుమిగూడారు. పారిస్, లండన్‌లోనూ ఈ నిరసనలు జరిగాయి. మధ్యాహ్నం అంతా వాషింగ్టన్ డీసీ నడిబొడ్డు వీధులలో జనం ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. నిరసనకారులు లింకన్ మెమోరియల్ మెట్లపై బారులు తీరారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులు వర్జీనియాలోని అర్లింగ్టన్ నుంచి ఒక వంతెన మీదుగా వాషింగ్టన్ డీసీలోకి పాదయాత్రగా వెళ్లారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ బయట నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనవరిలో ఇద్దరు అమెరికన్లపై ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కాల్పులు జరిపిన ఘటన తర్వాత, ట్రంప్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ విధానాలపై జరుగుతున్న చర్చకు ఈ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ బయట జరిగిన ర్యాలీలో బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ తన నిరసన గీతం ‘స్ట్రీట్స్ ఆఫ్ మిన్నియాపాలిస్’ పాడి అందరినీ ఉత్సాహపరిచారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ గుండా వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుద్ధానికి వ్యతిరేకంగా న్యూాయార్క్ సిటీలో పలు ప్లకార్డులు ప్రదర్శించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారిస్‌లోని ప్లేస్ డి లా బాస్టిల్ స్క్వేర్ వద్ద అమెరికా ప్రవాసులు, కొంతమంది ఫ్రెంచ్ పౌరులు కలిసి నిరసనల్లో పాల్గొన్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)