You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ ఇప్పటికీ సెమీఫైనల్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందా?
టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పుడు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే స్థితిలో నిలిచాయి.
ఈ రెండు జట్ల సెమీఫైనల్ అవకాశాలు, ఇతర జట్ల ఆట తీరు మీద ఆధారపడి ఉన్నాయి.
మంగళవారం సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ గెలిచింది.
ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
ఇప్పుడు పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరుకోవడానికి, న్యూజీలాండ్ ఎలా ఆడుతుందన్నదానిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంగళవారం మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది.
ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అత్యధికంగా 63 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్ చెరో 25 పరుగులు చేశారు.
లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్, ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడింది. కానీ, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ 51 బంతుల్లో 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 100 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను విజయానికి చేరువ చేశాడు.
పాకిస్తాన్‌పై ఈ విజయంతో ఇంగ్లండ్, ఈ వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
పాకిస్తాన్ సెమీఫైనల్ చేరుకోవాలంటే ఎలా?
వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆట ఇప్పుడు గెలుపోటముల సమీకరణాల మీద ఆధారపడి ఉందని జర్నలిస్ట్ ఫైజాన్ లఖానీ వ్యాఖ్యానించారు.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో పాకిస్తాన్ ప్రయాణం ఇప్పుడు వారి చేతుల్లో కాకుండా, అదృష్టం అనే మలుపు వద్ద నిలిచింది.
ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశం క్లిష్టంగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు న్యూజీలాండ్ ఆడబోయే మ్యాచ్‌లపైనే ఉంది.
న్యూజీలాండ్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సూపర్-8లో భాగంగా బుధవారం సాయంత్రం 7 గంటలకు శ్రీలంకతో న్యూజీలాండ్ ఆడనుంది.
పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే అదృష్టం తోడవ్వాలి. అలాగే న్యూజీలాండ్ మ్యాచ్ ఫలితం కూడా పాక్‌కు అనుకూలంగా వచ్చేలా ఉండాలి.
ఒకవేళ న్యూజీలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లు ఓడిపోతే, పాకిస్తాన్‌కు సెమీస్ మార్గం సులభం అవుతుంది.
అప్పుడు శ్రీలంకపై ఒక మ్యాచ్ గెలిస్తే చాలు పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది.
పాకిస్తాన్ అభిమానులు ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
ఇలా జరిగితే పరిస్థితి ఉత్కంఠగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్, శ్రీలంకను ఓడించడమే కాకుండా భారీ తేడాతో గెలవాలి. అలా అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది.
ప్రతీ ఫోర్, ప్రతీ సిక్స్, ప్రతీ వికెట్ కీలకమయ్యే దశ ఇది.
ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ కథ ఇక్కడితో ముగిసినట్లే.
పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రయాణం సెమీఫైనల్ కంటే ముందే ముగిసిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)