కరోనావైరస్: ఈ మహమ్మారి దెబ్బకు ఐసీయూ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్టినా జె.ఆర్గజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎప్పుడు ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక యంత్రం విషమ పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటుంది. ఒకప్పుడు కరోనా లాంటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఈ యంత్రాన్ని నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, మెకానికల్ వెంటిలేషన్ మెషిన్లు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రారంభం అయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎన్నో ఆస్పత్రులు వాటిని ఉపయోగిస్తున్నాయి. లక్షలాది కోవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స అందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
కరోనా సంక్షోభ సమయంలో ఐసీయూ, వెంటిలేటర్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ 68 ఏళ్ల క్రితం ఇవి అసలు ఉనికిలోనే లేవు.
1952 ఆగస్టులో ఇప్పటి కరోనావైరస్ లాగే ఒక మహమ్మారి వ్యాపించింది. దానివల్ల కొన్ని వేలమంది శ్వాసకోస వ్యవస్థ విఫలమై చనిపోయారు. అప్పుడు వ్యాపించిన ఆ వ్యాధి పోలియో.

ఫొటో సోర్స్, Getty images
68 ఏళ్ల క్రితం
డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో 500 పడకల బ్లేగడెమ్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో అందరికీ చికిత్స అందించలేని దారుణమైన పరిస్థితిలో పడిపోయారు డాక్టర్, నర్సులు.
ఆ రోగుల్లో ఎక్కువమంది పిల్లలే. ఆ సమయంలో పోలియో ఒక ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్. దానికి ఎలాంటి చికిత్స లేదు.
వారిలో చాలామందికి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే జబ్బు పడేవారు. కొన్ని కేసుల్లో ఈ వైరస్ వెన్నెముక, మెదడు నరాలపై దాడి చేసేది.
ఇది వచ్చిన రోగులకు, ముఖ్యంగా కాళ్లకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.
బ్రిటన్ హెల్త్ సర్వీస్ వివరాల ప్రకారం శ్వాసకోస వ్యవస్థలోని కండరాలు పక్షవాతానికి గురైనప్పుడు ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యేది.
గత శతాబ్దం మధ్యలో ఈ పోలియో మహమ్మారికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్ ఒకటి.

ఫొటో సోర్స్, Getty images
పోలియో మహమ్మారి
సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ప్రకారం బ్లెగడెమ్ ఆస్పత్రికి అప్పట్లో ప్రతి రోజూ 50 పోలియో కేసులు వస్తుండేవి. వాటిలో ఆరు నుంచి 12 కేసుల్లో రోజూ శ్వాసకోస వ్యవస్థ విఫలమై సమస్యలు వచ్చేవి.
“పోలియో మహమ్మారి వ్యాపించినప్పుడు మొదట్లో ఎక్కువమంది రోగులు వచ్చేవాళ్లు. వారిలో 87 శాతం రోగులు మెదడుపై, తర్వాత వారి శ్వాసను నియంత్రించే నరాలపై పోలియో దాడి చేసేది. ఆ రోగుల్లో ఎక్కువమంది పిల్లలే ఉండేవారు”.
కానీ ఒక డాక్టర్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఆధునిక మెడికల్ సైన్స్ చరిత్రలో ఒక కీలక అధ్యాయం లిఖించారు.
డెన్మార్క్ డాక్టర్ బజార్న్ ఆజే వృత్తిపరంగా అనస్తీషియా స్పెషలిస్ట్. ఆయన తన కెరియర్లో సుదీర్ఘ కాలం అమెరికాలోని బోస్టన్‌లో ఉన్నారు. తన దేశం ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన దానికి పరిష్కారం వెతికారు. వేలమంది పోలియో రోగుల ప్రాణాలను కాపాడారు.

ఫొటో సోర్స్, Getty images
ఐసీయూ అంత కీలకం ఎందుకు
“ప్రధాన అవయవాలు పనిచేయకుండా అగిపోయిన రోగులకు ప్రాణరక్షక వ్యవస్థ సపోర్టు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో రోగుల ప్రాణాలే ప్రమాదంలో పడవచ్చు” అని స్విట్జర్లాండ్‌లోని ఒక అతిపెద్ద ఆస్పత్రిలో కరోనా రోగుల బాగోగులు చూస్తున్న డాక్టర్ ఫిలిప్ జెంట్ చెప్పారు.
ఐసీయూలో రోగుల పరిస్థితిని సమీపం నుంచి గమనించవచ్చు. వారి అవసరాన్ని బట్టి చికిత్స మార్చవచ్చు. ఐసీయూలోనే మాత్రమే రోగులను ప్రత్యేకంగా చూసుకోవడం సాధ్యం అవుతుంది. ఐసీయూల కోసం ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఐసీయూలో చేర్చే రోగులను చూసుకునే డాక్టర్లు హై క్వాలిఫైడ్ అయి ఉండాలి.
బహుశా, అందుకే ఐసీయూను ఇంటెన్సివ్ మెడిసిన్ అని కూడా అంటారు. ఐసీయూలో రోగులను జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే ఉండదు. అక్కడ పరిశుభ్రత అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ కిడ్నీ, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగులకు అవసరమైన యంత్రాలు ఉపయోగించడం చాలా ముఖ్యం.
దీని గురించి డాక్టర్ ఫిలిప్ జెంట్ వివరిస్తూ.. “తరచూ ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుండేవి. ఆ సమస్య ఊపిరితిత్తులకు సంబంధించినది. అందుకే ఐసీయూలో చేర్చే రోగులకు రెస్పిరేటర్స్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తారు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లోహంతో చేసిన రెస్పిరేటర్
కానీ డెన్మార్క్ లో పోలియో మహమ్మారి వ్యాపించినపుడు కోపెన్హేగన్లో ఒక రెస్పిరేటర్ మాత్రమే ఉండేది. అది కూడా లోహంతో చేసినది.. అది కాకుండా అక్కడ ఆరు ‘ఎక్స్ టర్నల్ రెస్పిరేటర్స్’ కూడా ఉండేవి.
1953లో ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో రచయిత, బ్లెగడేమ్ హాస్పిటల్ చీఫ్ హెన్రీ సై అలగ్జాండర్ లాసెన్ “వాస్తవానికి పోలియో మహమ్మారి వ్యాపించినపుడు మాకు ఈ మెషిన్లు పూర్తిగా సరిపోలేదు. కానీ మేం వాటితోనే చికిత్స అందించాం. అప్పుడే వేరే దారులు కూడా వెతికాం. ముందు ముందు ఎవరికి రెస్పిరేటర్ పెట్టాలి, ఎవరికి పెట్టవద్దు అనే నిర్ణయం తీసుకునే పరిస్థితి మాకు రాకూడదని అనుకున్నాం” అన్నారు.
ఆ సమయంలో డాక్టర్ హెన్రీ ఎలాంటి సందిగ్ధంలో ఉన్నారో, అలాగే ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలో చాలామంది డాక్టర్లు అదే పరిస్థితిలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు.
బ్లెగడెమ్ ఆస్పత్రిలో లోహంతో చేసిన రెస్పిరేటర్ ఉండేది. దానిని 1928లో కనిపెట్టారు. అది ఒక కాప్స్యూల్లా ఉండేది. అందులో రోగి శరీరాన్ని ఉంచేవారు. రోగి శరీరం చుట్టూ ఆ యంత్రం శూన్యత(వాక్యూమ్)సృష్టించేంది. దానివల్ల రోగి పక్కటెముకలపై ఒత్తిడి పడుతూ ఉండేది. గాలి చొరబడేలా వారు ఊపిరితిత్తులను ఉబ్బించేవారు.
కానీ ఆ యంత్రంలో రోగి స్పృహతప్పినపుడు డాక్టర్లకు చాలా కష్టంగా ఉండేది. రోగులు తమ లాలాజలాన్ని మింగలేకపోయేవారు. కడుపులో జరిగేవి భరించలేకపోయేవారు. ఆ స్థితిలో రోగులకు తరచూ ఊపిరి తీసుకోవడంలో సమస్య వస్తుండేది.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ ఇస్పెన్ ఏం చేశారు
బ్లెగడెమ్ ఆస్పత్రి కోసం డాక్టర్ ఇస్బెన్ ఒక వ్యవస్థను రూపొందించారు. దాని సాయంతో ఆ ఆస్పత్రి సమస్యలన్నీ తీరిపోయాయి. ఆ కొత్త యంత్రంపై మొట్టమొదట చికిత్స చేయించుకున్న రోగి ఒక 12 ఏళ్ల బాలిక. ఆమె పేరు వివి. పోలియో వైరస్‌తో పక్షవాతం రావడంతో ఆమె మరణం అంచుల్లో ఉంది.
ఆ మెడికల్ కేస్ గురించి డాక్టర్ ఇస్బెన్ను ఇంటర్వ్యూ చేసిన మరో అనస్తీషియా నిపుణుడు ప్రెబెత్ బర్తల్సన్ ఇలా వివరించారు. “అందరూ అప్పుడు వివి చనిపోతుందనే అనుకుంటున్నారు. కానీ డాక్టర్ ఇస్బెన్ సంప్రదాయ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు” అన్నారు.
పోలియో రోగులకు కూడా, సర్జరీ రోగుల్లాగే చికిత్సలు జరగాలని డాక్టర్ ఇస్బెన్ భావించేవారు. ఆయన రోగుల ఊపిరితిత్తుల్లోకి గాలిని నేరుగా పంపాలని అనుకున్నారు. అలా చేసినప్పుడు వారి శరీరం విశ్రాంతి తీసుకుంటుందని, మెల్లమెల్లగా స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాకియోస్టమీ ఆలోచన
పోలియో రోగులకు ట్రాకియోస్టమీ ఉపయోగించాలని కూడా డాక్టర్ ఇస్బెన్ సలహా ఇచ్చారు. ఈ ప్రక్రియలో రోగుల మెడ దగ్గర ఒక రంధ్రం చేసి, దాన్నుంచి ఒక ట్యూబ్ ద్వారా రోగి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ సరఫరా చేస్తారు.
అప్పట్లో ఆపరేషన్ సమయంలో మాత్రమే ట్రాకియోస్టమీ ఉపయోగించేవారు కానీ, పోలియో రోగి ఉన్న ఆస్పత్రి వార్డులో దానిని చేయడం గురించి బహుశా ఎవరూ ఆలోచించలేదు.
డాక్టర్ ఇస్బెన్ విధానం పనిచేస్తుంది అని బ్లెగడెమ్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ హెన్రీకి అసలు నమ్మకమే లేదు. కానీ అప్పుడు ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో, ఆయన అలా చేయడానికి అనుమతి ఇచ్చారు. చివరికి అద్భుతం జరిగింది. డాక్టర్ ఇస్బెన్ విధానం వల్ల చనిపోతుందని అంతా అనుకున్న పోలియో రోగి వివి కోలుకుంది.
కానీ, ఆ ప్రక్రియలో కూడా ఒక సమస్య వచ్చింది. ఊపిరితిత్తుల్లోకి రబ్బర్ ట్యూబ్ ద్వారా గాలి పంపించడానికి యంత్రాలేవీ లేవు. దానిని అప్పట్లో చేతితో నొక్కాల్సి వచ్చేది. డాక్టర్ లేదా నర్సులు ప్రెజర్ నాబ్ లేదా బ్యాగ్ సాయంతో ట్యూబ్ ద్వారా గాలి పంపించేవారు. దానికోసం డాక్టర్ హెన్రీకి చాలా మంది సిబ్బందికి డ్యూటీ వేయాల్సి వచ్చేది.
ఐసీయూ వార్డు స్థాపన
“ఆ తర్వాత మేం శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న రోగులందరికీ చికిత్స అందించగలిగే స్థితికి చేరుకున్నాం. పోలియో రోగుల మరణాల రేటు కూడా 87 శాతం నుంచి తగ్గి 31కి చేరింది” అని డాక్టర్ హెన్రీ చెప్పారు.
ఆ తర్వాత ఏడాది బ్లెగడెమ్ ఆస్పత్రిలో శాశ్వతంగా ఒక ఇన్సెంటివ్ కేర్ యూనిట్ వార్డు స్థాపించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రుల్లో వాటిని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రపంచమంతా ఐసీయూ పడకలు, మెకానికల్ వెంటిలేటర్ల కోసం ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఇవి లేకపోతే, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య చికిత్స అందించడం కష్టం అవుతుంది.
68 ఏళ్ల క్రితం సుమారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక డెన్మార్క్ అనస్తీషియా నిపుణుడు అప్పటి కష్టానికి పరిష్కారం వెతికాడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

మ్యాప్
ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించిన కేసులు
పూర్తిస్థాయి ఇంటరాక్టివ్ చూసేందుకు దయచేసి మీ బ్రౌజర్‌ని అప్‌గ్రేడ్ చేయండి.
ఆధారం: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ, జాతీయ ప్రజారోగ్య సంస్థలు
గణాంకాలు చివరిసారి అప్డేట్ అయిన సమయం 5 జులై, 2022 1:29 PM IST
గణాంకాలు విపులంగా
*లక్ష జనాభాకు మరణాలు
| అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 1012833 | 308.6 | 87030788 | ||
| బ్రెజిల్ | 672033 | 318.4 | 32535923 | ||
| భారత్ | 525242 | 38.4 | 43531650 | ||
| రష్యా | 373595 | 258.8 | 18173480 | ||
| మెక్సికో | 325793 | 255.4 | 6093835 | ||
| పెరూ | 213579 | 657.0 | 3640061 | ||
| యునైైటెడ్ కింగ్డమ్ | 177890 | 266.2 | 22232377 | ||
| ఇటలీ | 168604 | 279.6 | 18805756 | ||
| ఇండోనేసియా | 156758 | 57.9 | 6095351 | ||
| ఫ్రాన్స్ | 146406 | 218.3 | 30584880 | ||
| ఇరాన్ | 141404 | 170.5 | 7240564 | ||
| జర్మనీ | 141397 | 170.1 | 28542484 | ||
| కొలంబియా | 140070 | 278.3 | 6175181 | ||
| అర్జెంటీనా | 129109 | 287.3 | 9394326 | ||
| పోలండ్ | 116435 | 306.6 | 6016526 | ||
| ఉక్రెయిన్ | 112459 | 253.4 | 5040518 | ||
| స్పెయిన్ | 108111 | 229.6 | 12818184 | ||
| దక్షిణాఫ్రికా | 101812 | 173.9 | 3995291 | ||
| టర్కీ | 99057 | 118.7 | 15180444 | ||
| రొమేనియా | 65755 | 339.7 | 2927187 | ||
| ఫిలిప్పీన్స్ | 60602 | 56.1 | 3709386 | ||
| చిలీ | 58617 | 309.3 | 4030267 | ||
| హంగేరీ | 46647 | 477.5 | 1928125 | ||
| వియత్నాం | 43088 | 44.7 | 10749324 | ||
| కెనడా | 42001 | 111.7 | 3958155 | ||
| చెక్ రిపబ్లిక్ | 40324 | 377.9 | 3936870 | ||
| బల్గేరియా | 37260 | 534.1 | 1174216 | ||
| మలేసియా | 35784 | 112.0 | 4575809 | ||
| ఈక్వెడార్ | 35745 | 205.7 | 913798 | ||
| బెల్జియం | 31952 | 278.2 | 4265296 | ||
| జపాన్ | 31328 | 24.8 | 9405007 | ||
| థాయిలాండ్ | 30736 | 44.1 | 4534017 | ||
| పాకిస్తాన్ | 30403 | 14.0 | 1539275 | ||
| గ్రీస్ | 30327 | 283.0 | 3729199 | ||
| బంగ్లాదేశ్ | 29174 | 17.9 | 1980974 | ||
| ట్యునీషియా | 28691 | 245.3 | 1052180 | ||
| ఇరాక్ | 25247 | 64.2 | 2359755 | ||
| ఈజిప్ట్ | 24723 | 24.6 | 515645 | ||
| దక్షిణ కొరియా | 24576 | 47.5 | 18413997 | ||
| పోర్చుగల్ | 24149 | 235.2 | 5171236 | ||
| నెదర్లాండ్స్ | 22383 | 129.1 | 8203898 | ||
| బొలీవియా | 21958 | 190.7 | 931955 | ||
| స్లొవాకియా | 20147 | 369.4 | 2551116 | ||
| ఆస్ట్రియా | 20068 | 226.1 | 4499570 | ||
| మియన్మార్ | 19434 | 36.0 | 613659 | ||
| స్వీడన్ | 19124 | 185.9 | 2519199 | ||
| కజకిస్థాన్ | 19018 | 102.7 | 1396584 | ||
| పరాగ్వే | 18994 | 269.6 | 660841 | ||
| గ్వాటెమలా | 18616 | 112.1 | 921146 | ||
| జార్జియా | 16841 | 452.7 | 1660429 | ||
| శ్రీలంక | 16522 | 75.8 | 664181 | ||
| సెర్బియా | 16132 | 232.3 | 2033180 | ||
| మొరాకో | 16120 | 44.2 | 1226246 | ||
| క్రొయేషియా | 16082 | 395.4 | 1151523 | ||
| బోస్నియా & హెర్జ్‌గొవీనా | 15807 | 478.9 | 379041 | ||
| చైనా | 14633 | 1.0 | 2144566 | ||
| జోర్డాన్ | 14068 | 139.3 | 1700526 | ||
| స్విట్జర్లాండ్ | 13833 | 161.3 | 3759730 | ||
| నేపాల్ | 11952 | 41.8 | 979835 | ||
| మాల్డోవా | 11567 | 435.2 | 520321 | ||
| ఇజ్రాయెల్ | 10984 | 121.3 | 4391275 | ||
| హోండూరస్ | 10906 | 111.9 | 427718 | ||
| లెబనాన్ | 10469 | 152.7 | 1116798 | ||
| ఆస్ట్రేలియా | 10085 | 39.8 | 8291399 | ||
| అజర్బైజాన్ | 9717 | 96.9 | 793388 | ||
| ఉత్తర మాసిడోనియా | 9327 | 447.7 | 314501 | ||
| సౌదీ అరేబియా | 9211 | 26.9 | 797374 | ||
| లిథువేనియా | 9175 | 329.2 | 1162184 | ||
| ఆర్మేనియా | 8629 | 291.7 | 423417 | ||
| క్యూబా | 8529 | 75.3 | 1106167 | ||
| కోస్టారికా | 8525 | 168.9 | 904934 | ||
| పనామా | 8373 | 197.2 | 925254 | ||
| అఫ్ఘానిస్తాన్ | 7725 | 20.3 | 182793 | ||
| ఇథియోపియా | 7542 | 6.7 | 489502 | ||
| ఐర్లాండ్ | 7499 | 151.8 | 1600614 | ||
| ఉరుగ్వే | 7331 | 211.8 | 957629 | ||
| తైవాన్ | 7025 | 29.5 | 3893643 | ||
| బెలారస్ | 6978 | 73.7 | 982867 | ||
| అల్జీరియా | 6875 | 16.0 | 266173 | ||
| స్లొవేనియా | 6655 | 318.7 | 1041426 | ||
| డెన్మార్క్ | 6487 | 111.5 | 3177491 | ||
| లిబియా | 6430 | 94.9 | 502189 | ||
| లాత్వియా | 5860 | 306.4 | 837182 | ||
| వెనెజువెలా | 5735 | 20.1 | 527074 | ||
| పాలస్తీనా భూభాగం | 5662 | 120.8 | 662490 | ||
| కెన్యా | 5656 | 10.8 | 334551 | ||
| జింబాబ్వే | 5558 | 38.0 | 255726 | ||
| సూడాన్ | 4952 | 11.6 | 62696 | ||
| ఫిన్లాండ్ | 4875 | 88.3 | 1145610 | ||
| ఒమన్ | 4628 | 93.0 | 390244 | ||
| డొమినికన్ రిపబ్లిక్ | 4383 | 40.8 | 611581 | ||
| ఎల్ సాల్వడార్ | 4150 | 64.3 | 169646 | ||
| నమీబియా | 4065 | 163.0 | 169247 | ||
| ట్రినిడాడ్ & టొబాగో | 4013 | 287.7 | 167495 | ||
| జాంబియా | 4007 | 22.4 | 326259 | ||
| ఉగాండా | 3621 | 8.2 | 167979 | ||
| అల్బేనియా | 3502 | 122.7 | 282690 | ||
| నార్వే | 3337 | 62.4 | 1448679 | ||
| సిరియా | 3150 | 18.5 | 55934 | ||
| నైజీరియా | 3144 | 1.6 | 257637 | ||
| జమైకా | 3144 | 106.6 | 143347 | ||
| కొసావో | 3140 | 175.0 | 229841 | ||
| కంబోడియా | 3056 | 18.5 | 136296 | ||
| కిర్గిస్తాన్ | 2991 | 46.3 | 201101 | ||
| బోట్స్వానా | 2750 | 119.4 | 322769 | ||
| మాంటినిగ్రో | 2729 | 438.6 | 241190 | ||
| మలావి | 2646 | 14.2 | 86600 | ||
| ఎస్తోనియా | 2591 | 195.3 | 580114 | ||
| కువైట్ | 2555 | 60.7 | 644451 | ||
| యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 2319 | 23.7 | 952960 | ||
| మొజాంబిక్ | 2212 | 7.3 | 228226 | ||
| మంగోలియా | 2179 | 67.6 | 928981 | ||
| యెమెన్ | 2149 | 7.4 | 11832 | ||
| సెనెగల్ | 1968 | 12.1 | 86382 | ||
| కామెరూన్ | 1931 | 7.5 | 120068 | ||
| అంగోలా | 1900 | 6.0 | 101320 | ||
| ఉజ్బెకిస్తాన్ | 1637 | 4.9 | 241196 | ||
| న్యూజీలాండ్ | 1534 | 31.2 | 1374535 | ||
| బహ్రెయిన్ | 1495 | 91.1 | 631562 | ||
| రువాండా | 1460 | 11.6 | 131270 | ||
| ఘానా | 1452 | 4.8 | 166546 | ||
| సింగపూర్ | 1419 | 24.9 | 1473180 | ||
| ఇ స్వటిని | 1416 | 123.3 | 73148 | ||
| మడగాస్కర్ | 1401 | 5.2 | 65787 | ||
| కాంగో | 1375 | 1.6 | 91393 | ||
| సురినామ్ | 1369 | 235.5 | 80864 | ||
| సోమాలియా | 1361 | 8.8 | 26803 | ||
| గయానా | 1256 | 160.5 | 67657 | ||
| లక్సెంబర్గ్ | 1094 | 176.5 | 265323 | ||
| సైప్రస్ | 1075 | 89.7 | 515596 | ||
| మారిషస్ | 1004 | 79.3 | 231036 | ||
| మౌరిటానియా | 984 | 21.7 | 60368 | ||
| మార్టినిక్ | 965 | 257.0 | 195912 | ||
| గ్వాడలోప్ | 955 | 238.7 | 168714 | ||
| ఫిజీ | 866 | 97.3 | 65889 | ||
| టాంజానియా | 841 | 1.4 | 35768 | ||
| హైతీ | 837 | 7.4 | 31677 | ||
| బహమాస్ | 820 | 210.5 | 36101 | ||
| రియూనియన్ ఐలాండ్ | 812 | 91.3 | 422769 | ||
| ఐవరీ కోస్ట్ | 805 | 3.1 | 83679 | ||
| లావోస్ | 757 | 10.6 | 210313 | ||
| మాల్టా | 748 | 148.8 | 105407 | ||
| మాలి | 737 | 3.7 | 31176 | ||
| లెసోతో | 699 | 32.9 | 33938 | ||
| బెలిజ్ | 680 | 174.2 | 64371 | ||
| ఖతార్ | 679 | 24.0 | 385163 | ||
| పపువా న్యూగినీ | 662 | 7.5 | 44728 | ||
| ఫ్రెంచ్ పోలినీసియా | 649 | 232.4 | 73386 | ||
| బార్బడోస్ | 477 | 166.2 | 84919 | ||
| గినియా | 443 | 3.5 | 37123 | ||
| కేప్ వర్డి | 405 | 73.6 | 61105 | ||
| ఫ్రెంచ్ గయానా | 401 | 137.9 | 86911 | ||
| బుర్కీనా ఫాసో | 387 | 1.9 | 21044 | ||
| రిపబ్లిక్ ఆఫ్ కాంగో | 385 | 7.2 | 24128 | ||
| సెయింట్ లూసియా | 383 | 209.5 | 27094 | ||
| గాంబియా | 365 | 15.5 | 12002 | ||
| న్యూ కాలెడోనియా | 313 | 108.8 | 64337 | ||
| నైజర్ | 310 | 1.3 | 9031 | ||
| మాల్దీవులు | 306 | 57.6 | 182720 | ||
| గబాన్ | 305 | 14.0 | 47939 | ||
| లైబీరియా | 294 | 6.0 | 7497 | ||
| కురాకో | 278 | 176.5 | 44545 | ||
| టోగో | 275 | 3.4 | 37482 | ||
| నికరాగువా | 242 | 3.7 | 14690 | ||
| గ్రెనడా | 232 | 207.1 | 18376 | ||
| బ్రూనై | 225 | 51.9 | 167669 | ||
| అరూబ | 222 | 208.8 | 41000 | ||
| చాద్ | 193 | 1.2 | 7426 | ||
| జిబౌటీ | 189 | 19.4 | 15690 | ||
| మయొట్టీ | 187 | 70.3 | 37958 | ||
| ఈక్వటోరియల్ గినియా | 183 | 13.5 | 16114 | ||
| ఐస్లాండ్ | 179 | 49.5 | 195259 | ||
| చానెల్ ఐలాండ్స్ | 179 | 103.9 | 80990 | ||
| గినియా-బిస్సావు | 171 | 8.9 | 8369 | ||
| సీషెల్స్ | 167 | 171.1 | 44847 | ||
| బెనిన్ | 163 | 1.4 | 27216 | ||
| కొమొరోస్ | 160 | 18.8 | 8161 | ||
| ఆండొరా | 153 | 198.3 | 44177 | ||
| సోలొమన్ దీవులు | 153 | 22.8 | 21544 | ||
| ఆంటిగ్వా& బార్బడా | 141 | 145.2 | 8665 | ||
| బెర్ముడా | 140 | 219.0 | 16162 | ||
| దక్షిణ సుడాన్ | 138 | 1.2 | 17722 | ||
| తిమోర్-లెస్టె | 133 | 10.3 | 22959 | ||
| తజకిస్తాన్ | 125 | 1.3 | 17786 | ||
| సియెర్రా లియోన్ | 125 | 1.6 | 7704 | ||
| శాన్ మారినో | 115 | 339.6 | 18236 | ||
| సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్ | 114 | 103.1 | 9058 | ||
| సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 113 | 2.4 | 14649 | ||
| ఐల్ ఆఫ్ మన్ | 108 | 127.7 | 36463 | ||
| జిబ్రాల్టర్ | 104 | 308.6 | 19633 | ||
| ఎరిత్రియా | 103 | 2.9 | 9805 | ||
| సెయింట్ మార్టిన్(డచ్) | 87 | 213.6 | 10601 | ||
| లిక్చిమ్స్టెయిన్ | 85 | 223.6 | 17935 | ||
| సావొటోమ్ & ప్రిన్సిపె | 74 | 34.4 | 6064 | ||
| డొమినికా | 68 | 94.7 | 14852 | ||
| సెయింట్ మార్టిన్(ఫ్రెంచ్) | 63 | 165.8 | 10952 | ||
| బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ | 63 | 209.8 | 6941 | ||
| మొనాకో | 59 | 151.4 | 13100 | ||
| సెయింట్ కిట్స్ & నెవిస్ | 43 | 81.4 | 6157 | ||
| బురుండి | 38 | 0.3 | 42731 | ||
| బోనైర్, సింట్ ఈస్టేషియస్, సాబా | 37 | 142.4 | 10405 | ||
| టర్క్స్ & కైకోస్ దీవులు | 36 | 94.3 | 6219 | ||
| కేమెన్ దీవులు | 29 | 44.7 | 27594 | ||
| సమోవా | 29 | 14.7 | 14995 | ||
| ఫారో దీవులు | 28 | 57.5 | 34658 | ||
| భూటాన్ | 21 | 2.8 | 59824 | ||
| గ్రీన్లాండ్ | 21 | 37.3 | 11971 | ||
| వనౌతు | 14 | 4.7 | 11389 | ||
| కిరిబాతి | 13 | 11.1 | 3236 | ||
| డైమెండ్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్ | 13 | 712 | |||
| టోంగా | 12 | 11.5 | 12301 | ||
| అంగ్విల్లా | 9 | 60.5 | 3476 | ||
| మాంట్సెరాట్ | 8 | 160.3 | 1020 | ||
| వాలిస్ అండ్ ఫుటునా ఐలాండ్స్ | 7 | 61.2 | 454 | ||
| పలావు | 6 | 33.3 | 5237 | ||
| సెయింట్ బార్తెలెమి | 6 | 60.9 | 4697 | ||
| ఎంఎస్ జాండమ్ క్రూజ్ షిప్ | 2 | 9 | |||
| కుక్ దీవులు | 1 | 5.7 | 5774 | ||
| సెయింట్ పియెర్ అండ్ మిఖెలన్ | 1 | 17.2 | 2779 | ||
| ఫాక్లాండ్ దీవులు | 0 | 0.0 | 1815 | ||
| మైక్రొనీషియా | 0 | 0.0 | 38 | ||
| వాటికన్ | 0 | 0.0 | 29 | ||
| మార్షల్ దీవులు | 0 | 0.0 | 18 | ||
| అంటార్కిటికా | 0 | 11 | |||
| సెయింట్ హెలినా | 0 | 0.0 | 4 |
పూర్తిస్థాయి అనుభూతి కోసం దయచేసి మీ బ్రౌజర్‌ని అప్‌గ్రేడ్ చేయండి
ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. కానీ, ప్రతి దేశంలో తాజా గణాంకాలను చూపించకపోవచ్చు.
**కొత్త కేసులకు సంబంధించిన డేటా, గత మూడు రోజుల సగటు ఆధారంగా తీసుకున్నది. కేసులు వేగంగా పెరుగుతున్నందున, ఈ రోజుకు సగటును వెంటనే లెక్కించడం సాధ్యం కాదు.
ఆధారం: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ, జాతీయ ప్రజారోగ్య సంస్థలు
గణాంకాలు చివరిసారి అప్డేట్ అయిన సమయం: 5 జులై, 2022 1:29 PM IST
భారత్‌లో కరోనావైరస్ కేసులు
ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు
| రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం | మొత్తం కేసులు | కోలుకున్నవారు | మరణాలు |
|---|---|---|---|
| మహారాష్ట్ర | 1351153 | 1049947 | 35751 |
| ఆంధ్రప్రదేశ్ | 681161 | 612300 | 5745 |
| తమిళనాడు | 586397 | 530708 | 9383 |
| కర్నాటక | 582458 | 469750 | 8641 |
| ఉత్తరాఖండ్ | 390875 | 331270 | 5652 |
| గోవా | 273098 | 240703 | 5272 |
| పశ్చిమ బెంగాల్ | 250580 | 219844 | 4837 |
| ఒడిశా | 212609 | 177585 | 866 |
| తెలంగాణ | 189283 | 158690 | 1116 |
| బిహార్ | 180032 | 166188 | 892 |
| కేరళ | 179923 | 121264 | 698 |
| అస్సాం | 173629 | 142297 | 667 |
| హరియాణా | 134623 | 114576 | 3431 |
| రాజస్థాన్ | 130971 | 109472 | 1456 |
| హిమాచల్ ప్రదేశ్ | 125412 | 108411 | 1331 |
| మధ్యప్రదేశ్ | 124166 | 100012 | 2242 |
| పంజాబ్ | 111375 | 90345 | 3284 |
| ఛత్తీస్‌గఢ్ | 108458 | 74537 | 877 |
| జార్ఖండ్ | 81417 | 68603 | 688 |
| ఉత్తర్‌ప్రదేశ్ | 47502 | 36646 | 580 |
| గుజరాత్ | 32396 | 27072 | 407 |
| పుదుచ్చేరి | 26685 | 21156 | 515 |
| జమ్మూ కశ్మీర్ | 14457 | 10607 | 175 |
| చండీగఢ్ | 11678 | 9325 | 153 |
| మణిపుర్ | 10477 | 7982 | 64 |
| లద్దాఖ్ | 4152 | 3064 | 58 |
| అండమాన్ - నికోబార్ దీవులు | 3803 | 3582 | 53 |
| దిల్లీ | 3015 | 2836 | 2 |
| మిజోరమ్ | 1958 | 1459 | 0 |
ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అప్డేట్ అయిన సమయం 11: 30 IST
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్ను చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారుచేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























