సమ్మర్ టూర్ : ‘యూరప్ మాల్దీవులు’, మాంటెనెగ్రో... ఈ దేశాలను చౌకగా చుట్టి రావచ్చా?

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎమెర్ మోరో
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

అంతగా ఎవరికీ తెలియని ప్రదేశాన్ని కనుగొన్నప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది.

ఈ ఏడాది ఎక్కువ మంది విదేశాల్లో "నిజమైన" సెలవు అనుభవాలను వెతుకుతున్నారు. అన్ని సౌకర్యాలున్న పర్యటక ప్రాంతాల కంటే ఈ నిజమైన అనుభవాలకే ప్రాధాన్యమిస్తున్నారని ది అసోసియేషన్ ఫర్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్- ఏబీటీఏ చెప్పింది.

ఈ ఏడాది గతంలో ఎన్నడూ వెళ్లని దేశానికి వెళ్లాలని ప్రతీ ఐదుగురిలో ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నట్లు ఏబీటీఏ తెలిపింది.

మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా కొంతమంది ఐరోపా దేశాలకు వెళుతున్నారు. జెట్ ఇంధన కొరత రావచ్చనే ఆందోళనలు, అధిక జీవన వ్యయం కారణంగా మరి కొందరు హాలిడే ప్లాన్లను పూర్తిగా పక్కన పెడుతున్నారు.

ఈ వేసవిలో మీరు తక్కువ ఖర్చుతో కూడిన, విలక్షణమైన హాలిడే డెస్టినేషన్ కోసం చూస్తుంటే, జనాదరణ పొందుతున్న అలాంటి ప్రాంతాలు ఏవో తెలుసుకునేందుకు ఈ కథనం చదవండి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Em's Budget Travel

ఫొటో క్యాప్షన్, తన మాంటెనెగ్రో పర్యటనకు తగిన విలువ లభించిందని ఎమ్ చెప్పారు.

మాంటెనెగ్రో

మాంటెనెగ్రో ఓ దాగి ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.

ఈ బాల్కన్ దేశానికి బ్రిటన్ నుంచి ఇప్పుడు అనేక విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

హాలిడే కోసం గ్రీస్, ఇటలీ, క్రొయేషియాకు వెళ్లి సెలవుల్ని పూర్తిగా అక్కడే గడపడానికి ఇష్టపడని వారికి మాంటెనెగ్రో ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది.

మాంటెనెగ్రో చాలా చిన్నది. పర్యటకులు ఇక్కడ బీచ్ హాలిడేను ఎంజాయ్ చేయచ్చు. నగరంలో తిరగవచ్చు. బయటకు వెళ్లవచ్చని అరేంజ్ మై స్పేస్ ట్రావెల్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ జెన్నిఫర్ లించ్ చెప్పారు.

"మీరు బీచ్ రిసార్ట్‌లో ఉంటే, ఒక రోజు పర్వతాలలోకి వెళ్లవచ్చు. మాంటెనెగ్రో అంతా రైళ్లలో తిరగవచ్చు. బోస్నియా, క్రొయేషియా కూడా వెళ్లచ్చు" అని ఆమె అన్నారు.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Anadolu Agency via Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రం, పర్వతాలు, సరస్సులు, గుహలు, జలపాతాలు, చరిత్రను చాటి చెప్పే నగరాలతో మాంటెనెగ్రో పర్యటకుల్ని ఆకర్షిస్తోంది.

మాంటెనెగ్రో సంప్రదాయ కుటుంబ విహార ప్రదేశం కాకున్నా, సాహసికుల కోసం కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని జెన్నిఫర్ చెప్పారు.

ఎనిమిది రోజుల అడ్వెంచర్ ప్యాకేజీకి ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 2.27 లక్షలు ఖర్చవుతుందని ఆమె అంచనా వేశారు.

హాలిడే ఎంజాయ్ చేయడానికి, పర్యటన వివరాలు పంచుకోవడానికి మాంటెనెగ్రోలో పర్యటించవచ్చని యువకులు కొందరు టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతున్నారు.

మాంటెనెగ్రో పర్యటన ఖర్చుకు తగిన అనుభూతి పంచుతుందని ట్రావెల్ బ్లాగర్ ఎమ్ అంటున్నారు.

"క్రొయేషియా లాగే ఉన్నా.. చవకైనది. ఇది ఒక రకంగా నగరం సముద్ర తీర విహారం కలయిక లాంటిది" అని ఆమె అన్నారు.

నాలో ప్రయాణించాలనే కోరికను రేకెత్తించిన తొలి ప్రదేశాలలో బహుశా అది ఒకటి అని ఎమ్ చెప్పారు.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Em's Budget Travel

ఫొటో క్యాప్షన్, ఎమ్.. బోస్నియా సహా అనేక బాల్కన్ దేశాల్లో పర్యటించారు.

బాల్టిక్ తీరం

కుటుంబాలు, జంటలు, ఒంటరి ప్రయాణికులకు ఎస్తోనియా, ఫిన్లాండ్, లిథువేనియా.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. మాంటెనెగ్రో మాదిరిగానే ఈ మూడు దేశాల మధ్య ప్రయాణం చాలా తేలిక.

ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ నుంచి ఫెర్రీలో ఎస్తోనియా రాజధాని టాలిన్ చేరుకోవచ్చు.

స్పెయిన్‌లో లేదా మరి కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతను ఇష్టపడని వారు బాల్టిక్ సముద్రపు బీచ్‌లలో విహరించవచ్చు. జూలైలో టాలిన్‌లో పగటిఉష్ణోగ్రత సాధారణంగా సుమారు 21 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అయితే ఆ సమయంలో నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది.

లిథువేనియాలో ఐదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. అందువల్ల ఇది చరిత్ర తెలుసుకోవాలనుకునే వారికి ఇష్టమైన ప్రదేశం అనుకోవచ్చు.

బాల్టిక్ తీరంలో "జర్మన్ రివేరా" కూడా ఉంది. జర్మనీలోని అతిపెద్ద ద్వీపమైన రూజెన్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి సున్నపురాయి కొండలు, జాతీయ పార్కులు, సహజసిద్ధ మత్స్యకార గ్రామాలు దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయ. బెర్లిన్ నుంచి రైలులో 3 గంటలు ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, బాల్టిక్ సముద్రంలోని రూజెన్ ద్వీపానికి జర్మన్లు అధిక సంఖ్యలో వస్తున్నారు.

వేరే దేశాల నుంచి విమానంలో బెర్లిన్ వచ్చిన తర్వాత మూడు గంటల రైలు ప్రయాణం కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా పెరుగుతున్న పర్యటకుల సంఖ్య చూస్తుంటే..ప్రజలు హాలిడే డెస్టినేషన్‌లో ప్రయాణం కూడా భాగమని భావిస్తున్నట్లు అనిపిస్తోందని ఏబీటీఏకు చెందిన ఎమ్మా బ్రెన్నన్ చెప్పారు.

"మీరు ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే మీకు అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. దారిలో ఆగుతారు. దీని వల్ల ఒక ప్రాంతానికి చేరుకుని అక్కడి ప్రకృతి అందాలపై దృష్టి పెట్టడానికి బదులు దారి పొడవునా అన్నింటినీ ఆనందిస్తారు" అని ఆమె చెప్పారు.

సాంప్రదాయ నగరాలకు దూరంగా ఒక దేశపు ప్రత్యేక అనుభూతిని అనుభవించడానికి ఎదురు చూస్తున్న పర్యటకుల సంఖ్య పెరగడానికి రూజెన్ ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా కొంతమంది ఉత్తర యూరోపియన్ దేశాలకు వస్తున్నారని కోర్ట్నీ వరల్డ్ ట్రావెల్‌కు చెందిన స్టెఫ్ జెప్సన్ చెప్పారు.

"ప్రస్తుతం మా క్లయింట్లు సైప్రస్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది సైప్రస్ సిగ్గు పడాల్సిన విషయం. ఎందుకంటే పర్యటక రంగం వారి ప్రధాన పరిశ్రమ" అని జెఫ్సన్ అన్నారు.

జూన్‌లో టాలిన్‌లో ఒక జంట కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఏడు రాత్రుల ప్యాకేజీకి మొత్తం సుమారు రూ. 2.25 లక్షల రూపాయలు ఖర్చవుతుందనేది ఆమె అంచనా. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సుమారు రూ. 4.25 లక్షలు ఖర్చవుతుంది.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Amber Robertson

ఫొటో క్యాప్షన్, అల్బేనియాలో అంబర్ తీసిన ఫోటోల్లో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి.

అల్బేనియా

మీ హాలిడేలో అల్బేనియాను భాగంగా చేసుకోవడం చాలా సులభం.

"మీరు గ్రీస్‌లోని కార్ఫుకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి ఫెర్రీలో అరగంట ప్రయాణించి సరండాకు చేరుకోవచ్చు. ఒకరకంగా అది 'అల్బేనియన్ రివేరా'కు ప్రవేశ ద్వారం లాంటిది" అని ట్రావెల్ బ్లాగర్ అంబర్ రాబర్ట్‌సన్ వివరించారు.

ఇటీవలి సంవత్సరాలలో అల్బేనియాపై ఆమె రూపొందించిన గైడ్‌ను చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటాన్ని ఆమె గమనించారు .

"మీ కోసం అందమైన బీచ్‌లు, మంచి బీచ్ క్లబ్‌లు ఉన్నాయి. గ్రీస్‌లో ఉన్న అనుభూతిని పొందవచ్చు. అది కూడా తక్కువ ధరకే. అంతే కాదు. అక్కడ చాలా గొప్ప చరిత్ర ఉంది" అని ఆమె చెప్పారు.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Amber Robertson

ఫొటో క్యాప్షన్, అల్బేనియాలోని బ్లూ వాటర్స్, తెల్లని ఇసుకతో ఉన్న బీచ్‌లు ఉండటంతో ఈ దేశాన్ని మాల్దీవులతో పోలుస్తున్నారు.

అల్బేనియాలో బరత్, గిరోకాస్టర్‌. ఎంతో సంస్కృతి కలిగిన, పురాతనమైన అందమైన రాతి పట్టణాలు.

"యూరప్ మాల్దీవులు"గా పిలిచే ప్రదేశంలో ఒక జంటకు ఏడు రాత్రుల ప్యాకేజీకి, అన్ని సౌకర్యాలతో కలిపి సుమారు రూ. 1.75 లక్షలు ఖర్చవుతుందనేది జెప్సన్ అంచనా.

"మీ ప్రయాణానికి అయిన ఖర్చుకు తగిన విలువ ఇక్కడ ఉంది" అని ఆమె చెప్పారు.

అల్బేనియాలో చాలా ఆసక్తికరమైన వన్యప్రాణులు ఉన్నాయి. అవి కుటుంబాలను లేదా ప్రత్యేక ఆసక్తి ఉన్న వ్యక్తులను ఆకర్షిస్తున్నాయి.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Amber Robertson

ఫొటో క్యాప్షన్, అంబర్ రాబర్ట్‌సన్ 48 అవర్స్ ఇన్ యూరప్ పేరుతో బ్లాగ్ నిర్వహిస్తున్నారు.

ఉత్తర స్పెయిన్

బ్రిటిష్ పర్యటకులకు స్పెయిన్ ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానంగా ఉందని ఏబీటీఏ చెబుతోంది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది బార్సిలోనా లేదా కోస్టా డెల్ సోల్ దాటి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని విస్తరించడానికి స్పానిష్ ప్రభుత్వం చేస్తున్న సమష్టి కృషి కారణంగా అస్టోరియస్, లా రియోజా అభివృద్ధి పథంలో ఉన్నాయని బ్రెన్నన్ చెప్పారు.

అక్కడ చాలా భిన్నమైన వాతావరణం ఉంటుంది. బీచ్‌లతో పాటు పచ్చదనం, పర్వతాలు, వన్యప్రాణులు కూడా ఉన్నాయి.

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాయువ్య స్పెయిన్‌లోని అస్టోరియాస్ ప్రాంతంలో ఉన్న పికోస్ డి యూరోపా పర్వతాలు.

ఎక్కువ మంది పర్యాటకులు ఆహారం, వైన్ వంటి ప్రత్యేక ఆసక్తి ఆధారంగా తమ హాలిడేను ప్లాన్ చేస్తున్నారని ఏబీటీఏ చెబుతోంది.

ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ప్రదేశాలకు వెళ్లడంలో తప్పు ఏమీ లేదని రాబర్ట్‌సన్ భావిస్తున్నారు

క్రొయేషియా, హాలిడే ప్లాన్, టూరిజం, సోషల్ మీడియా, గ్రీస్, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాన్ సెబాష్టియన్ వంటలకు ప్రసిద్ధి చెందింది.

శాన్ సెబాస్టియన్, బిల్బావో లాంటి ప్రదేశాలు ఇప్పటికీ కొంతమేరకు పర్యాటక ప్రాంతాలుగానే ఉన్నాయి.

అయితే పర్యటకుల సంఖ్య పరంగా ఇవి బార్సిలోనా కంటే చిన్నవే అవి ఆమె చెప్పారు.

ఆహారం అంటే ఆసక్తి ఉన్న వారికి శాన్ సెబాస్టియన్ చుట్టు పక్కల ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)