Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 9
Listen to find out how to make a phone call in English.
ఫోన్ కాల్ చేసి ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో విని నేర్చుకోండి.
Session 9 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I make a phone call?
ఈ కింది వాక్యాలు పరిశీలించి ఫోన్ చేసినవాళ్లు మాట్లాడేవి, ఫోన్ రిసీవ్ చేసుకున్నవాళ్లు మాట్లాడేవి విడదీసి కింది బాక్స్‌లో రాయండి.
Hello?
Hello, is Melissa there, please?
Sorry, she's not here at the moment.
Can I take a message?
It's ok. I'll call back later.
Hello, can I speak to Melissa, please?
Yes. Who’s speaking, please?
It’s Peter.
| CALLER | RECEIVER |
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello, everybody. Welcome!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో ఫోన్ కాల్ చేసి ఇంగ్లిష్‌లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ముందుగా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్లో జరుగుతున్న ఒక సంభాషణ విందాం. ఒకవేళ మీకు పూర్తిగా అర్థం కాకపోయినా కంగారుపడకండి. నేను మీకు సహాయం చేస్తాను. Peter ఎవరికి కాల్ చేసారు?
Melissa’s mother
Hello?
Peter
Hello, is Melissa there, please? It’s Peter.
Melissa’s mother
Sorry, she's not here at the moment. Can I take a message?
Peter
It's ok. I'll call back later.
సౌమ్య
విన్నారా? Peter, Melissa కి ఫోన్ చేసారు. కానీ ఆమెతో మాట్లాడడం కుదరలేదు. So, Sam, ఫోన్ కాల్ చెయ్యడానికి అవసరమైన భాషను ఒకసారి పరిశీలిద్దామా?
Sam
Good idea!
సౌమ్య
మొదట పీటర్ ‘మెలిస్సా ఉన్నారా?’ అని వాళ్ల అమ్మగారిని అడిగారు.
‘Is Melissa there, please?’
Sam
Yes, we make this question with ‘is’, the person’s name, and ‘there’. Let’s practise it together! Repeat after me:
‘Is Melissa there, please?’
సౌమ్య
ఇప్పుడు పీటర్ తనని తాను ఎలా పరిచయం చేసుకున్నారో చూద్దాం. ‘I’m Peter’ అన్నారా? ‘It’s Peter’ అన్నారా?
‘It’s Peter’.
Sam
He says ‘It’s’.
సౌమ్య
అవును, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇలా చెప్తారు. ముఖాముఖి కలిసి మాట్లాడుతున్నప్పుడు ‘I’m’ అని గానీ ‘My name’s…’ అని గానీ చెప్తారు.
Sam
…But on the telephone ‘it’s’.
సౌమ్య
ఇప్పుడు, మెలిస్సా వాళ్లమ్మ ఏం చెప్పారో మళ్లీ విందాం. Does she offer to do something?
‘Sorry, she's not here at the moment. Can I take a message?’
సౌమ్య
Yes, she offers to ‘take a message’…అంటే కబురు అందించడం. ఆమెకు ఏదైనా కబురు అందించాలా? అని అడిగారు.
Sam
But what did Melissa’s mother say before that?
సౌమ్య
ఆ..ఆవిడ ముందు ‘Sorry’ చెప్పారు. తరువాత, ‘she’s not here’..ఆమె ఇక్కడ లేరు ‘at the moment’..ఈ సమయంలో అన్నారు.
సరే, దానికి పీటర్ ఏం జవాబు ఇచ్చారో మళ్లీ విందాం. అతను ఏదైనా కబురు అందించమని చెప్పాడా?
‘It's ok. I'll call back later.’
సౌమ్య
లేదు. చెప్పలేదు. ‘It’s ok’ అన్నారు. ‘No, thank you’ అని చెప్పడానికి మరో పద్ధతి ‘It’s ok’. నేను మళ్లీ తరువాత కాల్ చేస్తాను.. ‘l’ll call back later’ అన్నారు. ఈ వాక్యంలో ‘I’, ‘will’..ఈ రెండిటినీ కలిపి ‘I’ll’ అని పలకాలి. దీని తరువాత క్రియాపదం రావాలి. ఇక్కడ ‘call back’ అనేది క్రియాపదం.
Sam
Let’s all practise together! Repeat after me:
‘I’ll call back later’.
Now it’s time for you to have some practice!
సౌమ్య
Yes! మీరు ఎవరికైనా ఫోన్ కాల్ చేసారనుకుందాం. మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకుంటారు? ఇక్కడ ‘I’m’ అని అనకూడదు, గుర్తుంచుకోండి. మీ పేరు చెబుతూ పరిచయం చేసుకోండి. మీరు చెప్పాక, Sam కూడా చెబుతారు. మీ జవాబుని, Sam చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.
Sam
It’s Sam.
సౌమ్య
బావుంది. ఇప్పుడు, మీరు మెలిస్సాకు ఫోన్ చేసారు. కాని ఆమె ఫోన్ ఎత్తలేదు. వేరేవాళ్లు ఎత్తారు. అప్పుడు ఏమడుగుతారు? Sam చెప్పిన జవాబుతో సరిపోల్చుకోండి.
Sam
Is Melissa there, please?
సౌమ్య
Very nice! ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకు జవాబు ఏం చెప్పారో వినండి.
‘Sorry, she's not here at the moment. Can I take a message?’
సౌమ్య
దీనికి జవాబుగా మీరేం చెప్తారు. ‘ఫరవాలేదు, నేను మళ్లీ తరువాత కాల్ చేస్తాను’ అని చెప్పండి. మీ జవాబులో మొదటి భాగం ‘it’s’ తో మొదలవ్వాలి. రెండో భాగం ‘I’ll’ తో మొదలవ్వాలి. తరువాత, Sam చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.
Sam
It's ok. I'll call back later.
సౌమ్య
Great! మీకు ఫోన్ కాల్ చేసి మాట్లాడడం వచ్చేసింది.
Sam
Yes, congratulations! Please join us next week for another episode of 'How do I…'? Bye!
సౌమ్య
Bye!
Learn more!
1. మనం ఎవరికి ఫోన్ చేసామో వాళ్లు కాకుండా వేరేవాళ్లు ఫోన్ ఎత్తినప్పుడు ఏమని అడగాలి?
రెండు రకాల పద్ధతులున్నాయి.
Is ____ there, please?
Can I speak to _____, please?
2. ఈ ప్రశ్నకు ఇవ్వగలిగే జవాబులు ఏవి?
సదరు వ్యక్తి అక్కడ లేకపోతే, అప్పుడు ‘He/ She’s not here at the moment’ అని చెప్పొచ్చు.
ఆ వ్యక్తి అక్కడే ఉంటే, మీ పేరు, వివరాలు చెప్పమని అడగొచ్చు...‘Who’s speaking?’ or ‘Who’s calling?’
3. పేరు, వివరాలు చెప్తున్నప్పుడు ‘I’m ____’ or ‘My name’s _____’ అని ఫోన్ సంభాషణలో వాడొచ్చా?
ఇవి వ్యక్తిగతంగా కలిసినప్పుడు పరిచయం చేసుకునే పద్ధతులు. కానీ, ఫోన్ సంభాషణలో సాధారణంగా ‘It’s ______’ అని వాడతారు.
4. ఈ కార్యక్రమంలో రెండుచోట్ల ‘Can I…?’ అని వచ్చింది. ఈ రెండుచోట్ల ఒకే అర్థంలో వాడారా?
‘Can’ అనేది చాలా ఉపయోగకరమైన పదం. దీన్ని అనేక విధాలుగా వాడొచ్చు.అభ్యర్ధన లేదా విన్నపం చేసేటప్పుడు ‘Can I speak to _____, please?’ అని వాడొచ్చు. నేను మీకు ఏదైనా సహాయం చెయ్యగలనా? ‘Can I take a message?’ అని అడగడానికి కూడా వాడొచ్చు. ఈ రెండింటిలోనూ ‘Can I’ + verb వస్తుంది.
How do I make a phone call?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
Hint
ఇక్కడ ‘can’ లేదా ‘is’ లలో దేనితోనైనా మొదలెట్టొచ్చు.Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
Hint
రెండు రకాలుగా చెప్పొచ్చు. Yes అని చెప్పొచ్చు. No అని కూడా చెప్పొచ్చు.Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
Hint
ఇది వ్యక్తిగతంగా కలిసినప్పటికంటే ఫోన్లో చెప్పేటప్పుడు వేరేగా ఉంటుంది.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Who’s speaking, please?
Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Join us for our next episode of How to…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
Hello?
హలో
Hello, is ______ there, please?
హలో, ______ఉన్నారా?
Sorry, he/she's not here at the moment.
సారీ, ఈ సమయంలో అతను/ఆమె ఇక్కడ లేరు.
Can I take a message?
నేను ఏదైనా కబురు అందించాలా?
It's ok. I'll call back later.
ఫరవాలేదు. నేను మళ్లీ తరువాత కాల్ చేస్తాను.
Hello, can I speak to _______, please?
హలో, నేను _______ తో మాట్లాడవచ్చా?
Yes. Who’s speaking, please?
అలాగే. ఎవరు మాట్లాడుతున్నారు?
It’s _____.
ఇది _____.