Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 3
Listen to find out how to talk about your likes and dislikes.
మీ ఇష్టాయిష్టాల గురించి ఇంగ్లిష్‌లో ఎలా వ్యక్తపరచాలో విని తెలుసుకోండి.
Session 3 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about likes and dislikes?
ఈ కింది ఉన్న పదాలను most positive నుంచి most negative క్రమంలో అమర్చండి.
- don’t like
- like
- really hate
- love
- don’t mind
విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Sam కూడా ఉన్నారు.
Sam
Hello, everybody. Welcome!
సౌమ్య
ఈ కార్యక్రమంలో ఇష్టాలు, అయిష్టాలను వ్యక్తపరిచే వివిధ రకాల పద్ధతులను తెలుసుకుందాం. ముందుగా, కాఫీ గురించి వీళ్ళంతా ఏమంటున్నారో విందాం. అర్థం కాకపోయినా కంగారుపడకండి. మరేం ఫరవాలేదు...నేను మీకు సహాయం చేస్తాను. ప్రస్తుతానికి, ఎవరికి కాఫీ పట్ల బలమైన భావన ఉందని మీకనిపిస్తోందో చెప్పండి?
I like coffee.
I love coffee.
I don’t mind coffee.
I really hate coffee!
సౌమ్య
కనిపెట్టగలిగారా? అవును, చివరి వ్యక్తికి కాఫీ గురించి బలమైన భావన ఉంది! So, Sam, ఇష్టాయిష్టాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే భాషను పరిశీలిద్దామా?
Sam
Yes, let’s do it!
సౌమ్య
అన్ని వాక్యాల్లోనూ కాఫీ గురించి మాట్లాడారు. ఇక్కడ కాఫీ అనేది ఒక నామవాచకం. మొదటి వ్యక్తి, కాఫీ గురించి చెప్పడానికి ఏ పదం వాడారు? మళ్లీ విందాం.
I like coffee.
సౌమ్య
‘Like’..ఇష్టం అనే క్రియను వాడారు. ఇష్టానికి వ్యతిరేకమైన భావన వ్యక్తపరచాలంటే ‘like’ కు ముందు ‘don’t’ అనే పదం వాడాలి. అప్పుడు అది ‘I don’t like coffee’ అవుతుంది.
Sam
Now, let’s quickly practise the pronunciation together! Repeat after me:
‘I like coffee’.
‘I don’t like coffee’.
సౌమ్య
Great! తరువాతి వ్యక్తి వేరొక క్రియను వాడారు. అదేమిటో మళ్లీ విందాం.
I love coffee.
సౌమ్య
‘Love’. ఇది ‘Like’ కన్నా ఘాటైన పదమా?
Sam
Yes, it is! Let’s practise the pronunciation together. Repeat after me:
‘I love coffee’.
సౌమ్య
తరువాత! మరో వ్యక్తి ఏమన్నారో విందాం.
I don’t mind coffee.
సౌమ్య
Ok, so ఇతను ‘don’t mind’ అనే phrase వాడారు. ‘Don’t mind’ అంటే ‘ఫరవాలేదు, తాగగలను’ అనే అర్థంలో వస్తుంది. అంటే, కాఫీ పట్ల భావన మరీ సానుకూలం కాదు, అలా అని వ్యతిరేకమూ కాదు. – ఈ రెంటికీ మధ్యలో ఎక్కడో ఉన్నారన్నమాట. అయితే, ఇలాంటి విషయం చెప్పేటప్పుడు మనం ఎప్పుడూ ‘don’t’ అనే వాడాలి. ఇది ‘like’ మాదిరి కాదు.
Sam
And let’s practise the pronunciation together. Repeat after me:
‘I don’t mind coffee.’
సౌమ్య
And, we have one more. చివరి వ్యక్తి కాఫీ గురించి ఏమన్నారు?
I really hate coffee!
సౌమ్య
ఆమె ‘really hate’..నిజంగా వెగటు/అసహ్యం అన్నారు. మామూలుగా ‘hate’ అని చెప్పొచ్చు. కానీ ‘really’ అని వాడుతున్నారంటే వాళ్లకు ఆ ఫీలింగ్ చాలా తీవ్రంగా ఉంది అని అర్థం. మనం ‘like’ and ‘love’ లకు కూడా ‘really’ వాడొచ్చు. అది చాలా ఇష్టం అనే అర్థాన్ని సూచిస్తుంది. అలాగే ‘don’t like’ ముందు కూడా ‘really’ వాడొచ్చు... అస్సలు ఇష్టం లేదు అని చెప్పడానికి.
Sam
Yes, so you can say 'I really like coffee' or ‘I really love coffee’. The way you say ‘really’ is important here, so let’s practise together. Repeat after me:
‘really’.
‘I really hate coffee!’
‘I really love coffee!’
సౌమ్య
Thanks, Sam. ఇష్టాయిష్టాల గురించి వ్యక్తపరిచే వివిధ పద్ధతులను తెలుసుకున్నాం కద. ఇప్పుడు కొంచం సాధన చేద్దాం. సరే, మీకు ‘chocolate’ అంటే సానుకూలమైన భావన...పాజిటివ్ ఫీలింగ్ ఉందనుకుందాం. ఆ భావన కూడా చాలా అధికంగా ఉంది కాబట్టి ‘really’ వాడండి. ఇప్పుడు ‘chocolate’ గురించి ఒక వాక్యం చెప్పండి? తరువాత Sam కూడా చెబుతారు. అది విని, మీరు చెప్పిన వాక్యాన్నిసరిపోల్చి చూసుకోండి.
Sam
I really love chocolate.
సౌమ్య
Did you say the same? ‘I really like chocolate’ అని కూడా చెప్పొచ్చు. కానీ ‘love’ అని వాడితే మీ ఇష్టం చాలా బలంగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు, మీ ఫీలింగ్, ‘like’ కు వ్యతిరేకం అనుకుందాం. కానీ ‘hate’ చేసేంత ఎక్కువ కాదు. ఇప్పుడు ‘chocolate’ గురించి మీ భావన ఏమిటో ఒక వాక్యంలో చెప్పండి. Sam జవాబుతో సరిపోల్చుకోండి.
Sam
I don’t like chocolate.
సౌమ్య
Did you say the same?
Sam
Well done! Now you know how to talk about things you ‘love’, ‘like’, ‘don’t mind’, ‘don’t like’ and ‘hate’, find a friend and tell them about the foods you like and don’t like!
సౌమ్య
Good idea! We really like it when you practise! మరో ‘How do I…’ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు...Bye!
Sam
Bye!
Learn more!
- ‘Like’కు విరుద్ధమైంది ఏది?
Don’t like. - ‘Love’ and ‘hate’ అనేవి ‘like’ and ‘don’t like’ ల కంటే దృఢమైన అభిప్రాయాలా?
అవును, ‘like’ కంటే ‘love’ బలమైన అభిప్రాయం. ‘Hate’ కూడా ‘don’t like’ కంటే బలమైన అభిప్రాయం. - ‘Love’ and ‘hate’ లను ఇంతకన్నా దృఢంగా చెప్పొచ్చా?
అవును. ‘Really’ అనే పదం వాడి ఆ అభిప్రాయాలను ఇంకా దృఢంగా చెప్పొచ్చు. ‘Like’ and ‘don’t like’ ల కు ముందు కూడా ‘really’ వాడొచ్చు. - ‘Don’t mind’ అనేది నెగటివ్ ఫీలింగ్ ను సూచిస్తుందా?
కాదు. అందులో 'don't' అనే పదం ఉన్నప్పటికీ అది నెగటివ్ ఫీలింగ్‌ను సూచించదు. 'Don't mind' అని చెప్తే ఆ విషయం పట్ల మరీ సానుకూలత గానీ, మరీ విరుద్ధ భావాలు గానీ లేవని అర్థం. మీరు ఆ విషయం పట్ల తటస్థంగా ఉన్నారు అని అర్థం.
How do I talk about likes and dislikes?
4 Questions
Put the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Help
Activity
Put the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
గుర్తుందా? 'don't' mind' అంటే ఫరవాలేదు అనే అర్థంలో వాడతాం.Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఇది చాలా పాజిటివ్ ఫీలింగ్‌ను వ్యక్తపరిచేది.Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఇది పాజిటివ్ ఫీలింగ్‌ను వ్యక్తపరిచేది.Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
ఈ కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
Hint
ఇది ఎక్కువ నెగటివ్ ఫీలింగ్‌ను వ్యక్తపరిచేది.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Tell us what foods you like and dislike on our Facebook group!
మీకు ఇష్టమైన ఆహారం, అయిష్టమైన ఆహారం గురించి ఫేస్బుక్ గ్రూప్ లో మాకు చెప్పండి!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
I like…
నాకు...ఇష్టం
I don’t like…
నాకు...ఇష్టం లేదు
I love…
నాకు...ప్రేమ/అత్యంత ఇష్టం
I hate…
నాకు...వెగటు/అసహ్యం
I don’t mind…
నాకు ఫరవాలేదు...
really
నిజంగా
coffee
కాఫీ
chocolate
చాక్లేట్