Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 5
Listen to find out how to talk about the weather in English.
వాతావరణం గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో విని తెలుసుకోండి.
Activity 1
How do I talk about the weather?
ఇక్కడ ఇచ్చిన వాక్యాలను ఉష్ణోగ్రతల ప్రకారం వేడితో మొదలెట్టి చలితో అంతమయేలా అమర్చండి.
It's cool
It's hot
It's warm
It's cold
వాతావరణం గురించి తెలియజెప్పే మరిన్ని పద్ధతులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వినండి.
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Sian కూడా ఉన్నారు.
Sian
Hi everybody. Welcome!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో వివిధ వాతావరణ పరిస్థితుల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ముందుగా, కొందరు వ్యక్తులు ఈరోజు వాతావరణాన్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. విన్న తరువాత, వాళ్లు చెప్పినవాటిల్లో మీకు ఏది బావుందనిపిస్తోందో చెప్పండి.
What's the weather like today?
A) It's really cold and rainy.
B) It's cloudy but it's quite warm outside.
C) Ugh it's raining now.
D) It's really sunny and it's very hot today!
సౌమ్య
ఆహా, నాకిప్పుడు వర్షం కావాలి. వర్షాకాలం హాయిగా ఉంటుంది. మరి, మీరెలాంటి వాతావరణాన్ని ఇష్టపడతారు? సరే, వాతావరణం గురించి చర్చించుకునే ముందు 'ఇవాళ వాతావరణం ఎలా ఉంది?' అని ఎవరినైనా ఎలా అడగాలో తెలుసుందాం.
Sian
OK, so we ask the question like this: 'What is the weather like?' And it just means 'tell me about the weather today'. Let's practise the pronunciation. Listen again and repeat.
'What's the weather like, today?’
సౌమ్య
So, Sian, వాతావరణానికి సంబంధించిన భాషను ఒకసారి పరిశీలిద్దామా? We heard lots of adjectives. Didn't we? Adjectives అంటే విశేషణాలు.
Sian
Yes! So we have adjectives to describe the weather and these are made with the noun plus the letter 'y'. Like, for 'rain' we can say 'it's rainy today'.
సౌమ్య
అవును. ఇక్కడ ‘వర్షం’–'rain' అనేది నామవాచకం. దీన్ని విశేషణంగా మార్చడానికి 'y' తగిలించాలి – 'rainy'. It's rainy today. ఇదే విధంగా మేఘం – 'cloud', సూర్యుడు – 'sun'..ఇలాంటి నామవాచకాలను కూడా విశేషణాలుగా మార్చేయొచ్చు. ప్రయత్నిస్తారా మరి? ఈ వాక్యాలు మీరు సరిగ్గా మార్చారో లేదో సరిచూసుకోండి.
‘It's cloudy but quite warm outside.’
‘It's really sunny and it's very hot today!!’
సౌమ్య
Yes, ఈ విశేషణాలన్నిటినీ, వాతావరణం గురించి చెప్పడానికి ఉపయోగించొచ్చు. రోజువారీ వాతావరణాన్ని గురించి మాత్రమే కాకుండా, సాధారణంగా మన దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అని చెప్పడానికి కూడా ఈ విశేషణాలను వాడొచ్చు. 'It is'– 'it's' అని మొదలెట్టడం మాత్రం మర్చిపోకండి.
Sian
Now, let’s quickly practise the pronunciation together!
‘It’s rainy’
‘It's sunny’
‘It's cloudy’
సౌమ్య
OK, విశేషణాల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు క్రియాపదాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు వర్షం పడుతోంది అని చెప్పడానికి 'it's raining now' అనాలి. ఇక్కడ ‘raining’ అని క్రియగా వాడుతున్నాం. Can you remember? Let's listen to find out…
‘It's raining now.’
Sian
That's right so you can say 'it's raining'.
సౌమ్య
Great. ఇందాక మనం ఉష్ణోగ్రత – ‘temperature’ గురించి కూడా మాట్లాడుకోవడం విన్నాం కదా. So మనకి వేడి – 'hot’, చలి – 'cold'.. ఈ రెండూ ఉన్నాయి. అంత వేడి కాదు, అంత చలి కాదు అని చెప్పడానికి ఏమంటారో ఇందాక విన్నారు, గుర్తుందా? మళ్లీ విందాం.
‘It's quite warm outside.’
Sian
That's right – so 'warm' is comfortable – not hot and not cold. We can also say 'it's cool' which is closer to cold.
సౌమ్య
సరే, వివిధ రకాల ఉష్ణోగ్రతల గురించి ఎలా చెప్పాలో ఒకసారి మళ్లీ విందాం: Listen and practise the pronunciation.
‘It's cold’
‘It's cool’
‘It’s warm’
‘It's hot’
సౌమ్య
OK, వాతావరణం గురించి చెప్పడానికి వివిధ రకాల పద్ధతులను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సాధన చేసే సమయం వచ్చేసింది. ముందుగా, ఇవాళ వాతావరణం ఎలా ఉంది అని అడగండి?
‘What's the weather like today?’
సౌమ్య
OK, so ఇవాళ చాలా మబ్బుగా ఉంది కానీ ఉష్ణోగ్రత మరీ వేడిగా కాదుగానీ వెచ్చగా ఉంది. దీన్ని ఎలా చెప్తారు?
‘It's really cloudy but quite warm’.
సౌమ్య
Did you say the same?
సౌమ్య
ఇవాళ చాలా వేడిగా ఉంది. ఎండ మండిపోతోంది. దీన్నెలా చెప్తారు?
‘It's really hot and sunny.’
సౌమ్య
Did you say the same?
Sian
It's raining here in London again! What's the weather like where you are? Come and tell us!
సౌమ్య
Good idea! See you next week for more great episodes of 'How to…'? Bye!
Sian
Bye!
Learn more!
1. వాతావరణం గురించి చెప్పే విశేషణాన్ని ఎలా రూపొందించాలి?
సాధారణంగా నామవాచకానికి 'y' చేర్చాలి.
So, 'rain' becomes 'it’s rainy'
'wind' becomes 'it's windy'
'sun' becomes 'it's sunny' *ఇక్కడ 'n' రెండుసార్లు రావాలి
2. వాతావరణం గురించి చెప్పేటప్పుడు ఎలాంటి క్రియాపదాలను వాడొచ్చు?
You can say 'it's raining' or 'it's snowing'
3. ఉష్ణోగ్రత గురించి ఎలా వివరించాలి?
In order from cold to hot you can say:
- it's cold
- it's cool
- it's warm
- it's hot
How do I talk about weather?
3 Questions
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
వాతావరణం ఎలా ఉంది? అని అడగడం గుర్తుందా?Question 1 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
వెచ్చగా ఉంది అనడానికి 'warm' అనే విశేషణాన్ని వాడతాం.Question 2 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
సరైన జవాబును ఎంచుకోండి.
ፍንጭ
ఇక్కడ కుదించబడిన పదం(short form)తో మొదలవ్వాలి. విశేషణం రావాలి.Question 3 of 3
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
What's the weather like today in your town?
Tell us on our Facebook group!
జవాబు మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
It's windy
గాలి బాగా వీస్తోంది/గాలిగా ఉంది
It's rainy
వర్షంగా ఉంది
It's raining
వర్షం కురుస్తోంది
It's snowing
మంచు పడుతోంది
The sun is shining
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు
cool
చలి
warm
వెచ్చదనం