ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని చూపించే 9 ఫోటోలు..

ఫొటో సోర్స్, Maxar / BBC

చదివే సమయం: 3 నిమిషాలు

ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ ఘర్షణ మరింత ముదిరితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా చెబుతున్నప్పటికీ...ఆ దేశం మద్దతు ఉందని ఇరాన్ బలంగా నమ్ముతోంది.

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫొటో సోర్స్, Maxar, Institute for Science and International security

ఇరాన్ యురేనియం ఉత్పత్తి చేసే ప్రాంతం ధ్వంసమయిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతామండలికి తెలిపింది. నతాంజ్ అణుకేంద్రం, తబ్రిజ్ నగరానికి దక్షిణంగా ఉన్న క్షిపణుల స్థావరం ధ్వంసమయినట్టు చిత్రాల్లో తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Maxar

ఇస్‌ఫహాన్‌లో నిర్మాణాలకు కలిగిన నష్టం శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. నతాంజ్‌లోగానీ, ఇస్‌ఫహాన్‌లోగానీ దాడుల వల్ల రేడియేషన్ ప్రభావం ఏమీ లేదని ఐఏఈఏ తెలిపింది. అనేక క్షిపణుల స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.

ఫొటో సోర్స్, EPA

ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. దాడుల సమయంలో ఇరాన్ లోపలి నుంచి మొసాద్ డ్రోన్లను ప్రయోగించగలిగిందని తెలుస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ ప్రారంభ లక్ష్యం నతాంజ్‌లోని అణు కేంద్రం, ఐఆర్‌జీసీకి సంబంధించిన ప్రాంతాలు. ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా దీని కోసం ప్రణాళికలు వేస్తోంది.

ఫొటో సోర్స్, Chris Biggers/Umbra Space

తబ్రిజ్ మిసైల్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆయుధ నిల్వ ప్రాంతాలు, క్షిపణి సెంటర్లను, అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇస్‌ఫహాన్‌‌లో నాలుగు కీలక భవనాలు దెబ్బతిన్నాయని ఐఏఈఏ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని, ఇది పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ గట్టిగా వాదిస్తోంది.

ఫొటో సోర్స్, Planet Labs PBC

కెర్మాన్‌షాలో జూన్ 7, జూన్ 14న తీసిన చిత్రాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని పిరాన్‌షహర్‌లో ఉన్న ఐఆర్‌జీసీ రాడార్ సైట్‌కు భారీ నష్టం వాటిల్లింది.

ఫొటో సోర్స్, Maxar/Getty Images

భవిష్యత్తులో ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తమ పరిష్కారం అణ్వాయుధాలను సమకూర్చుకోవడమే అని ఇరాన్ భద్రతా సంస్థలు చాలా కాలంగా వాదిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Telegram

''బంకర్స్ బస్టర్స్''తో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రహస్య గనుల లోపల యురేనియం ఉండవచ్చని భావిస్తున్నారు. ఇరాన్ అణు శక్తిని నాశనం చేయడమే తన ప్రాథమిక లక్ష్యమని నెతన్యాహు చెబుతున్నారు. కానీ తన విస్తృత లక్ష్యం ఇరాన్‌లో పాలన మార్పు అని దాడుల తర్వాతి ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)