Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 8
Listen to find out how to talk about someone’s personality in English.
ఇతరుల వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ఇంగ్లిష్లో ఎలా వివరించాలో విని తెలుసుకోండి.
Session 8 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about someone’s personality?
ఇవాల్టి కార్యక్రమం వినే ముందు, ఈ కింది పదాలకు అర్థాలు Session Vocabulary box లో చూడండి.
1. lazy
2. shy
3. quiet
ఇవాల్టి కార్యక్రమం విని, ఈ కింది క్విజ్ పూర్తి చెయ్యండి.
• Who in the family is lazy?
• Who in the family is quiet?
• Who in the family is shy?
ఇది విని, మీ జవాబులు సరిచూసుకోండి. తరువాత, కింద ఉన్న రాతప్రతితో సరిపోల్చుకోండి.

సౌమ్య
హాయ్ ! ‘How do I…’ కార్యక్రమానికి స్వాగతం. నేను సౌమ్య. నాతో పాటూ Phil కూడా ఉన్నారు.
Phil
Hello, everybody. Welcome!
సౌమ్య
ఇవాల్టి ఎపిసోడ్లో మనుషుల వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ఇంగ్లిష్లో ఎలా వివరించాలో తెలుసుకుందాం. ముందుగా, ఇక్కడ కొందరు తమ కుటుంబంలోని వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వివరిస్తున్నారు. విందాం.
What's your brother like?
He’s so friendly but he’s a little lazy.
What’s your mother like?
She’s funny, but a little shy.
What’s your father like?
He’s too serious and so quiet.
సౌమ్య
గమనించారా? ఇక్కడ అందరూ వాళ్ళ కుటుంబ వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి అనేక విధాలుగా వర్ణించారు. ప్రతీ సంభాషణ ఒకే ప్రశ్నతో మొదలయ్యింది. గమనించారా? ఆ ప్రశ్న ఏమిటంటే ‘what’s he or she like?’ మనం ‘is like’ ను ఒకరి వ్యక్తిత్వం గురించి అడగడానికిగానీ లేదా ఒకరి వ్యక్తిత్వాన్ని వర్ణించడానికిగానీ వాడతాం. ఈ ప్రశ్నకు సంబంధించిన ఉచ్చారణ గురించి Phil చెప్తారు. విని, ప్రాక్టిస్ చెయ్యండి.
Phil
Listen carefully to the pronunciation of ‘what’s’. Listen and repeat.
‘What’s he like?’
సౌమ్య
Well done! మొదటి సంభాషణలోని వ్యక్తిని ఎలా వర్ణించారో గుర్తుందా? మళ్లీ విందాం.
‘He’s so friendly but he’s a little lazy.’
సౌమ్య
ఇక్కడ రెండు పదాలు వాడారు. మొదటిది ‘friendly’…స్నేహపూర్వకమైన. Friendly కి ముందు ‘so’ అని వాడారు. విన్నారా? ఏదైనా ఒక అంశాన్ని నొక్కిచెప్పాడానికి ‘so’ అని వాడతాం. రెండో పదం ఏమిటి?
Phil
It was ‘lazy’ did you hear the word in front of this word?
సౌమ్య
అవును. Lazy కి ముందు ‘a little’ అని అన్నారు. ఈ పదాన్ని నెగటివ్ అర్థంలో వాడతాం. ‘A little’ అంటే కొంచం అని అర్థం.
Phil
That’s right, so we can say a little lazy and a little silly. Let’s practice saying that whole sentence. Listen and repeat.
‘He’s so friendly but he’s a little lazy.’
సౌమ్య
Great! తరువాతి సంభాషణ కూడా అదే ప్రశ్నతో మొదలయ్యింది. మళ్లీ విందాం.
‘What’s your mother like?’
సౌమ్య
వాళ్ళమ్మను ఎలా వర్ణించారో చూద్దాం.
‘She’s funny, but a little shy.’
సౌమ్య
ఇక్కడ మనకు ‘funny’ and ‘shy’ అనే రెండు పదాలొచ్చాయి. ఈ రెండిటినీ ‘but’ అనే పదంతో కలిపాం. ఒక పాజిటివ్ పదం, ఒక నెటగివ్ పదం కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు ‘but’...కానీ అని వాడతాం.
Phil
Yes, so I could say that you are a little lazy, but so friendly.
సౌమ్య
ధన్యవాదాలు! అవునేమో!
Phil
Let’s practise saying whole sentence repeat after me.
‘She’s funny, but a little shy.’
సౌమ్య
చివరి సంభాషణ కూడా మరో సారి విందాం.
'What’s your father like?'
‘He’s too serious and so quiet.’
సౌమ్య
ఇక్కడా ‘too’ అని వాడారు. ‘Too’ అంటే చాలా ఎక్కువ అని అర్థం. వ్యక్తిత్వం గురించి చెప్పేటప్పుడు ‘too’ అని వాడితే నెగటివ్ అర్థం వస్తుంది.
Phil
So, I can say somebody is too loud, or too old.
సౌమ్య
అవును. ‘Too serious’ and ‘so quiet’..ఈ రెండూ కూడా నెగటివ్ అర్థంలోనే వస్తాయి.
Phil
That’s right. So we can say somebody is too quiet and a little lazy.
సౌమ్య
Great! మీకు వ్యక్తుల గుణగణాల గురించి, వ్యక్తిత్వాల గురించి ఇంగ్లిష్లో ఎలా చెప్పాలో వచ్చేసింది. ఇప్పుడు కొంత సాధన చేద్దాం. మిమ్మల్ని ఎవరైనా మీ సోదరుడి గురించి అడిగారనుకుందాం.
‘What’s your brother like?’
సౌమ్య
మీ సోదరుడు ఇతరుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటాడు అని ఇంగ్లిష్లో చెప్పండి. తరువాత Phil చెప్పిన వాక్యంతో సరిపోల్చుకోండి.
Phil
He’s friendly.
సౌమ్య
Did you say the same?
ఇంకోటి ప్రయత్నిద్దాం. ఈసారి అతను ఇతరులను బాగా నవ్విస్తాడు అని చెప్పండి.
Phil
He’s funny.
సౌమ్య
Phil చెప్పినట్టే చెప్పారా? అయితే మీకు శుభాకాంక్షలు! చెప్పినట్టే చెప్పారా? అయితే మీకు శుభాకాంక్షలు! ఇవాల్టి కార్యక్రమం ముగించే సమయం వచ్చేసింది. ఇవాళ మీరు నేర్చుకున్నవన్నీ మీ స్నేహితులతో కలిసి సరదాగా ప్రాక్టిస్ చెయ్యండి. ‘Too’ ‘so’ ‘a little’..ఇవన్నీ వాడడం మరచిపోకండేం!
Phil
Good idea! Goodbye everyone!
సౌమ్య
Goodbye!
Learn more!
1. ‘Be like’ అంటే అర్థమేమిటి? ఎప్పుడు వాడాలి?
వ్యక్తుల వ్యక్తిత్వాలను వివరించేందుకు ఈ పద నిర్మాణాన్ని వాడతాం.
• What’s he like?
• What’s she like?
2. ‘So’, ‘too’ and ‘a little’..ఈ మూడింటినీ ఎక్కడ, ఎప్పుడు వాడాలి?
ఏదైనా గుణాన్ని నొక్కిచెప్పడానికి 'so' వాడతాం. 'So' కి బదులు 'very' అని కూడా వాడొచ్చు.
• He is so kind.
ఒక ప్రత్యేకమైన గుణం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడానికి 'too' వాడతాం
• She is too lazy.
ఒక ప్రత్యేకమైన గుణం కొంచం ఉన్నది అని చెప్పడానికి 'a litle' అని వాడాతాం.
• He is a little shy.
3. ఒక వాక్యంలో 'but, 'and'..ఈ రెండూ ఎలా వాడాలి?
వైరుధ్యమైన అంశాలను కలిపి చెప్పడానికి 'but' వాడాతాం. ఒకే రకమైన అంశాలను కలిపి చెప్పడానికి 'and' వాడతాం.
• He’s so friendly, but a little quiet.
• She’s so kind and funny.
How do I talk about someone’s personality
4 Questions
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఇది ఒకరి వ్యక్తిత్వాన్ని గురించి అడిగిన ప్రశ్నQuestion 1 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
మనం ‘and’ ఎప్పుడు వాడతాం?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
మనం ‘but’ ని ఒక వాక్యంలో ఎప్పుడు వాడతాం?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
సరైన జవాబు ఎంచుకోండి.
Hint
ఆమె మరీ ఎక్కువ సిగ్గరి కాదు, కొంచం సిగ్గరి అని ఎలా చెప్తాం?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Can you describe the personality of somebody you know in English?
మీకు తెలిసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంగ్లిష్లో వర్ణించి చెప్పగలరా?
Tell us on our Facebook group!
మా ఫేస్బుక్ గ్రూప్ లో చెప్పండి.
Join us for our next episode of How to…, when we will learn more useful language and practise your listening skills.
How do I… కార్యక్రమంలో మమ్మల్ని మళ్లీ కలిసి మరింత ఉపయోగకరమైన భాషను నేర్చుకోండి, మీ శ్రవణ కౌశలానికీ పదును పెట్టుకోండి.
Session Vocabulary
What’s he/she like?
అతను/ఆమె ఎలాంటివారు?
too
చాలా ఎక్కువ
so
చాలా
a little
కొంచం
but
కానీ
and
మరియు
friendly
స్నేహపూర్వకమైన
lazy
బద్దకస్తులు
funny
నవ్వించే
shy
సిగ్గరి
serious
గంభీరమైన
quiet
నిశ్శబ్దంగా ఉండు
talkative
మాటకారి/వాగుడుకాయ
hardworking
బాగా కృషి చేసే