టోక్యో ఒలింపిక్స్: భారత మహిళల హాకీ జట్టు విజయోత్సాహం.. ‘‘చక్ దే ఇండియా’’ వేడుకలు ఇవీ

భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిసార్లు సంతోషాన్ని పంచే ఘట్టాలు అలా మదిలో గుర్తుండిపోతాయి. అదేదో కలలా అనిపిస్తాయి. ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు ఆ అనుభూతిని చవిచూస్తోంది.

ఫొటో సోర్స్, CHARLY TRIBALLEAU/AFP via Getty Image

ఫొటో క్యాప్షన్, క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళల హాకీ జట్టు విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Image

ఫొటో క్యాప్షన్, ఈ మ్యాచ్‌లో గెలుపుతో సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి, భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఒకేఒక గోల్ కొట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

ఫొటో సోర్స్, CHARLY TRIBALLEAU

ఫొటో క్యాప్షన్, భారత్ తరఫున ఆ గోల్‌ను గుర్‌జీత్ కౌర్ కొట్టారు. ఆ ఒక్క గోల్‌తో భారత్ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టగలిగింది.

ఫొటో సోర్స్, CHARLY TRIBALLEAU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ ముగిసిన వెంటనే భారత మహిళా జట్టు సభ్యులు ఒకర్ని మరొకరు హత్తుకుంటూ కనిపించారు.

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరైతే సంతోషంతో నేలపై కూర్చుండిపోయారు. మరికొందరు వారిపై సరదాగా పడటంతో సంతోషం వెల్లివిరిసింది.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images

ఫొటో క్యాప్షన్, ఆ తర్వాత అందరూ గుమిగూడి అభినందనలు చెప్పుకున్నారు. ఆ తర్వాత విజయోత్సాహంతో గట్టిగా అరిచారు.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకవైపు భారత మహిళల హాకీ జట్టు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటే, మరోవైపు ఆస్ట్రేలియా క్రీడాకారిణులు బాధతో కనిపించారు.

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా ప్లేయర్ల మొహాల్లో ఓటమి బాధ కనిపించింది.

ఫొటో సోర్స్, CHARLY TRIBALLEAU/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఒక్క గోల్ కూడా కొట్టకుండా భారత ప్లేయర్లు కట్టడి చేయగలిగారు.

ఫొటో సోర్స్, Buda Mendes/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి, చరిత్ర సృష్టించింది.