ఆస్ట్రేలియాలో విద్యార్థుల సోలార్ కార్ల రేస్

కార్ల పోటీల్లోనే ప్రత్యేకమైన ఒక పోటీ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీలో సౌర విద్యుత్‌తో నడిచే కార్లే తలపడతాయి.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచం నలుమూలల నుంచి 30కి పైగా దేశాలకు చెందిన బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరం నుంచి దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం వరకు మూడు వేల కిలోమీటర్ల దూరం మేర ఈ రేస్ జరుగుతుంది.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కార్లన్నీ విద్యార్థులు సొంతంగా తయారుచేసినవే. ప్రపంచ సోలార్ ఛాలెంజ్‌ అనే ఈ పోటీలో విద్యార్థులు జట్లుగా పోటీపడతారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, రేస్ ప్రారంభానికి ముందు పోటీదారులు తమ కార్లతో ట్రయల్స్ నిర్వహించారు. పోటీ శనివారం మొదలైంది.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటి దశలో బెల్జియం‌కు చెందిన పంచ్ పవర్‌ట్రైన్ జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇది గంటకు 83.4 కిలోమీటర్ల సగటు వేగంతో సాగింది.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, జట్లు డార్విన్ నుంచి బయల్దేరాక పోటీ ముగిసే వరకు స్థానిక కాలమానం ప్రకారం ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రయాణిస్తూనే ఉండాలి. ఆ సమయానికి ఎక్కడ ఉంటే అక్కడే బస చేయాలి. ఆహారం, బస ఏర్పాట్లు అన్నీ సొంతంగానే చేసుకోవాలి.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, రేస్ సాగే మార్గంలో ఏడు చోట్ల తనిఖీ కేంద్రాలు ఉంటాయి. అక్కడ కార్ల టైర్ల ప్రెజర్ సరిచూసుకోవడం లాంటి కనీస నిర్వహణ పనులను మాత్రమే అనుమతిస్తారు.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, జట్లు మూడు విభాగాల్లో పోటీపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోటీ విభాగాలను ఛాలెంజర్ క్లాస్, క్రూయిజర్ క్లాస్, అడ్వెంచర్ క్లాస్‌ అని వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యంత వేగంగా ప్రయాణించగలిగే జట్లు గురువారం అడిలైడ్ చేరే అవకాశముంది.