తెలంగాణలో వాటర్ స్పౌట్: నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

వీడియో క్యాప్షన్, తెలంగాణలో వాటర్ స్పౌట్: నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం 'నిర్జప్ల' వద్ద మంజీరా నదిలో అరుదుగా కనిపించే వాటర్ స్పౌట్ ఏర్పడింది.

ఆదివారం (4-9-2022) సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఏర్పడి సింగూరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నీరు సుడులు తిరుగుతూ పైకిలేచి మేఘాల వైపు వెళ్లింది.

సుమారు 3 నిముషాల పాటు ఈ దృశ్యం కనిపించింది. ఈ వాటర్ స్పౌట్ వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)