ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ : ఈ యువకుడు వాతావరణ సమాచారాన్ని ఎలా ఇస్తున్నారు?
ఒక పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ అంశాలను విశ్లేషించి, అంచనాలు కట్టి, సోషల్ మీడియాలో అందించి ఎంతో మందికి చేరువయ్యారు.
ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో వాతావరణ సమాచారం తెలుసుకొనే యూజర్లకు ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’గా సుపరిచితుడైన ఈ యువకుడి పేరు సాయిప్రణీత్. ఆయన ఊరు తిరుపతి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సాయిప్రణీత్, బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
ప్రజలకు ఉపయోగపడేలా వాతావరణ సమాచారం అందించడం తనకు ఎంతో ఇష్టమని ఆయన బీబీసీతో చెప్పారు. వాతావరణ అంచనాలను అందించడానికి తాను చాలా వెబ్‌సైట్లపై ఆధారపడతానని, అయితే చివరికి ఈ పని చాలా గొప్పగా అనిపిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఖాతాకు ట్విటర్‌లో 55 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఏపీ వెదర్‌మ్యాన్ ట్విటర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ వరదలు: ‘మాకు సరుకులు, మందులు కావాలి’.. సహాయం కోసం బీబీసీ బృందానికి నోట్ విసిరిన బాధితులు
- విజయవాడ ఎయిర్‌పోర్టు: విమానం చార్జీ కన్నా క్యాబ్ చార్జీలు ఎందుకు ఎక్కువ? ఓలా, ఊబర్ ట్యాక్సీలను ఎందుకు అనుమతించట్లేదు?
- ‘ఎప్పటికీ తండ్రిని కాకూడదు అనుకుని, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఓ భర్త కథ’
- మన పూర్వీకులు 70 లక్షల సంవత్సరాల క్రితమే నిటరుగా నడవడం మొదలుపెట్టారు - తాజా అధ్యయనంలో వెల్లడి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)