తెలంగాణ: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో బర్డ్ వాక్ ఫెస్టివల్... ఫోటో ఫీచర్

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో జనవరి 8,9 తేదీల్లో రెండో బర్డ్ వాక్ ఫెస్టివల్ జరిగింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్, సిర్పూర్, పెంచికల్ పేట్, కాగజ్ నగర్ రేంజ్ ల పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు ప్రకృతి ప్రేమికుల్ని అలరించాయి. బర్డ్ వాక్ సందర్శనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడి అడవి అందాలను, సొగసైన పక్షులను తమ కెమేరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్బంగా పెంచికల్ పేట్ మండలం నందిగామ వద్ద... పెద్దవాగు, ప్రాణహిత నదులు కలిసే చోట పాలరాపుగుట్టలో అంతరించేపోయే దశలో ఉన్న అరుదైన పొడుగు ముక్కు రాబందు కూడా కనిపించింది.

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, కామన్ కింగ్ ఫిషర్

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, దట్టమైన అడవుల్లో ఎలుకలు, బల్లులను వేటాడే గుడ్లగూబ

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, బార్ హెడెడ్ గూస్- చలినుండి కాపాడుకునేందుకు హిమాలయ పర్వాత ప్రాంతాల నుండి వలస వస్తుంది. బాతు జాతిలోకెల్లా ఎత్తులో ఎగరడం వీటి ప్రత్యేకత.

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, గ్రీన్ బీ ఈటర్: సీతాకోక చిలుకలు, బూగలను గాలిలోనే వేటాడితినడం దీని ప్రత్యేకత

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, రెడ్ ఫ్లేమ్ బ్యాక్ వుడ్ పిక్కర్- చెట్ల చెదలు, పురుగులను ఆహారం గా తీసుకుంటుంది

ఫొటో సోర్స్, Satish Lal

ఫొటో క్యాప్షన్, కింగ్ ఫిషర్

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, గ్రీన్ బీ ఈటర్

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, వూలీ నెక్డ్ స్టార్క్- ఎండిపోయిన చెట్ల మధ్య గూడు కట్టుకునే పక్షి

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, బిల్డ్ డక్- శీతాకాలంలో వలసపోయే పక్షి... చెరువులు, సరస్సుల ప్రాంతాల్లో దీని నివాసం

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, యూరాసియన్ స్పూన్ బిల్- చెరువుల్లో నాచు ను ఎక్కువగా తింటుంది.

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, రుడీ షెల్ డక్- యూరప్ నుంచి వచ్చే వలస పక్షులు

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, గ్రేట్ ఇగ్రేట్- అందమైన తెల్లని రూపంతో ఆకర్షిస్తుంది. కాలి వేళ్లు పుసుపు రంగులో ఉంటాయి. నదులు, వాగుల వద్ద గుంపులుగా చేపలను వేటాడుతాయి.

ఫొటో సోర్స్, Lingampally Krishna

ఫొటో క్యాప్షన్, అంతరించిపోయే దశలో ఉన్న రాబందులు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ నందిగామ సమీపంలోని పాలరాపుగుట్టల్లో ఈ పక్షి ఆవాసాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Satish Lal

ఫొటో క్యాప్షన్, డవ్ – గువ్వజాతికి చెందిన పక్షి